Oppo Find N3 Price In India: ఇటీవలే సాంసంగ్ విడుదలు చేసిన  ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌కు భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించిది. భారత్‌ మార్కెట్‌లో సాంసంగ్‌ విడుదల చేసిన Samsung Galaxy Z Series స్మార్ట్‌ ఫోన్స్‌ మిడిల్‌ రేంజ్‌లో లభిస్తున్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ఒప్పో కూడా త్వరలోనే తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ Oppo Find N3ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికీ అధికారికంగా వివరించలేదు. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను లీక్ చేశాడు. అయితే ఈ Oppo Find N3కు సంబంధించిన ఫీచర్లు, విడుదల తేదికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లీక్‌ అయిన వివరాల ప్రకారం..కంపెనీ  Oppo Find N3  ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ ఈ సంవత్సరం చివరి నెలలో విడుదల చేయబోతోందని తెలుస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఉన్న  ఫోల్డబుల్ ఫోన్స్‌కు భిన్నంగా ఉండబోతోంది. ఇక డిజైన్‌ విషయానికొస్తే ఎంతో స్లిమ్‌తో పాటు చాలా తేలికగా ఉండబోతోందని లీక్‌ అయిన ఫోట్స్‌ చూస్తే తెలుస్తోంది. దీన్ని Find N2కి సక్సెసర్‌గా లాంచ్ చేయవచ్చని టిప్‌స్టర్స్‌ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి ఫోటీగా  Galaxy Z Fold 5  ఫోల్డబుల్ ఫోన్‌ జూలై 26న విడుదల కానుంది. 


Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు  



ఈ స్మార్ట్ ఫోన్‌ చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. టిప్‌స్టర్‌ అందించిన ఫీచర్ల వివరాలు చూస్తే..Oppo Find N3 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని వెనక బాగం హై లుక్‌తో కనిపిస్తుంది. OISతో కూడిన 50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా కంపెనీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌లో పెరిస్కోప్ లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఆగస్టు 29న చైనాలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా విడుదల చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ప్రముఖ టిప్‌స్టర్‌  మాక్స్ జాంబోర్ చెబుతున్నారు. 



ఇతర స్పెసిఫికేషన్లు:
✽ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌
✽ ట్రిపుల్ కెమెరా సెటప్‌
✽ 50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
✽ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్
✽ 2268x2440 పిక్సెల్ రిజల్యూషన్‌
✽ 8 అంగుళాలు OLED డిస్‌ప్లే
✽ 120Hz రిఫ్రెష్ రేట్‌
✽ 6.5 అంగుళాల HD+ కవర్ డిస్‌ప్లే
✽ 16 GB ర్యామ్‌
✽ 1 TB రోమ్‌


Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook