ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ OPPO తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. Oppo A79 5G పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది మరియు దీని ధర కూడా చాలా తక్కువే. OPPO సంస్థ విడుదల చేసిన అఫీషియల్ నోట్ లో విడుదల చేసిన వివరాల ప్రకారం.. "మంచి డిజైన్ ఆకర్షణీయమైన పని తీరు మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో మంచి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చాము" అని తెలిపింది. Oppo A79 5G 7.9 మిమీ మరియు 193 గ్రాములు బరువు ఉంటుంది. Oppo A79 5G ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు మనం తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo A79 5G స్పెసిఫికేషన్స్.. 
Oppo A79 5G డిస్ప్లే విషయానికి వస్తే 6.72 అంగుళాలు మరియు FHD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ డిస్ప్లే గేమింగ్ మరియు చూసే వీడియోలకు సూపర్-క్లియర్ ఇమేజ్‌ని అందిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే వస్తుంది.  ఇది డిస్ప్లే  స్క్రోలింగ్, గేమ్‌ప్లేను మరింత మృదువుగా చేస్తుంది. Oppo యొక్క ఆల్ డే AI కంటి ప్రొటెక్షన్.. కళ్లపై  కలిగే ఒత్తిడి మరియు అలసట నుండి సంరక్షించడంలో సహాయపడుతుంది. Widevine L1 సర్టిఫికేషన్‌తో వచ్చే డిస్‌ప్లే Amazon Prime, Netflix వంటి యాప్‌ల నుండి HD వీడియో కంటెంట్‌ను చూడగలిగేలా చేస్తుంది.


Oppo A79 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 6020 SoC కలిగి ఉంది. కావున ఇది 2.2GHz క్లాక్ స్పీడ్‌తో కూడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ప్రాసెసర్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడింది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం ఈ కాన్ఫిగరేషన్ సరిగ్గా సరిపోతుంది. Oppo A2mలో ఉపయోగించిన అదే చిప్‌సెట్‌ను ను Oppo A79 5G లో కూడా ఉపయోగించారు .   


Also Read: India-Canada Conflict: కెనడాకు వీసా సేవల్ని పునరుద్ఱరించిన ఇండియా, ఆ 4 కేటగరీలకే


Oppo A79 5G కెమెరా & బ్యాటరీ.. 
ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ షూటర్ కూడా ఉంది. ఇక ముందు భాగానికి వస్తే.. 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 8-మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీలు మరియు వీడియో కాల్‌లకు సరిపోతుంది. Oppo A79 5G భారీ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది మీకు రోజంతా ఉండేలా తగినంత శక్తిని అందిస్తుంది. ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి మీరు బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయవచ్చు.


Oppo A79 5G ధర
Oppo A79 5G మన దేశంలో రెండు కలర్లలో లాంచ్ చేయబడింది. అవేంటంటే.. గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్. దీని ధర రూ. 19,999, అయితే బ్రాండ్ క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ EMI మరియు డివైజ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. 


Also Read: Winter immunity: చలికాలం తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..