OPPO Reno 12 5G Price Dropped: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాలన్ని అందిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OPPO Reno 12 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇతర ప్రీమియం ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ OPPO Reno 12 5G స్మార్ట్‌ఫోన్‌ ఒక స్టోరేజ్‌ వేరియంట్, మూడు విభిన్న కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ ధర MRP రూ.43,999తో లభిస్తోంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి ఫ్లాట్‌ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ కేవలం రూ.32,999కే పొందవచ్చు. ఇదే కాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.


బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ OPPO Reno 12 5G మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్స్‌లో కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు BOB, DBS బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.3,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను రూ. 29,999కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌ వివరాలు:
AI పవర్డ్ ఫీచర్లు
హై రెజొల్యూషన్ సెన్సార్లు 
ఓఐఎస్ ఫీచర్లు
AMOLED డిస్‌ప్లే 
ప్రీమియం బిల్డ్ క్వాలిటీ
AI ఫీచర్లు
ఇమేజింగ్, కమ్యూనికేషన్ AI ఫీచర్లు
14 Android ఆధారిత కస్టమ్ స్కిన్
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
5G సపోర్ట్


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి