Oppo F27 Pro: 64MP కెమేరా 8GB Ram మిలట్రీ మన్నికతో Oppo F27 Pro Plus లాంచ్, ధర ఎంతంటే
Oppo F27 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ, కెమేరాపరంగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన Oppo నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. 64 మెగాపిక్సెల్ కెమేరా, శక్తివంతమైన డ్యూరబిలిటీతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Oppo F27 Pro: Oppo నుంచి కొత్తగా Oppo F27 Pro Plus లాంచ్ అయింది. ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఐపీఎస్ రేటింగులతో, మిలట్రీ గ్రేడ్ మన్నికతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఒప్పో కంపెనీ అభివర్ణిస్తోంది. ఈ ఫోన్ ర్యామ్, కెమేరా, బ్యాటరీ, ప్రోసెసర్ ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ కర్వ్డ్ స్క్రీన్ , 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, 950 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. దీంతోపాటు ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 6ఎన్ఎం ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ-256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటాయి. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.3 వెర్షన్, వైఫై 6 ఉన్నాయి. 67 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పించే ఐపీ66, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ కలిగి ఉంది. కాస్మోస్ రింగ్ డిజైన్, 3డి కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఒప్పో అంటేనే కెమేరా రిజల్యూషన్‌కు పెట్టింది పేరు. చాలామంది కెమేరా రిజల్యూషన్ బాగుంటుందనే కారణంతో ఒప్పో ఫోన్ కొనుగోలు చేస్తుంటారు. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి.
Oppo F27 Pro Plusలో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 27,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 29,999 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు ఒప్పో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇవాళ్టి నుంచి ప్రీ ఆర్డర్ బుకింగ్ అందుబాటులో ఉంది. జూన్ 20 నుంచి అమ్మకాలు ప్రారంభమౌతాయి.
Also read: Worlds Expensive Car: ఈ కారు డబ్బులతో 200 విల్లాస్ లేదా 3 వేల కార్లు కొనేయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook