OPPO Smartphones: దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి కొత్త ఏడాదిలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. Oppo Find X7, Oppo Find X7 Ultra పేరుతో వస్తున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధర, ఫీచర్లు అందర్నీ ఆకట్టుకోనున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ స్మార్ట్‌ఫోన్లలో ఒప్పో ప్రత్యేకమైంది. అద్భుతమైన ఫీచర్లు, బ్యాటరీ బ్యాకప్, కెమేరా, తక్కువ ధర ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. అందుకే మార్కెట్‌లో ఒప్పోకు డిమాండ్ ఉంది. ఒప్పో కొత్త ఏడాది పురస్కరించుకుని రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేయనుంది. Oppo Find X7,Oppo Find X7 Ultra స్మార్ట్‌ఫోన్లు జనవరి 8న లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం..రెండింట్లోనూ డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానల్, 5 హోల్ కట్ అవుట్ డిజైన్ ఉంటుంది. రెండు స్మార్ట్‌పోన్లు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటాయి. వీటికి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. Oppo Find X7లో ట్రిపుల్ కెమేరా సెటప్, Oppo Find X7 Ultraలో క్రౌడ్ కెమేరా సెటప్ ఉన్నాయి. Oppo Find X7 సిరీస్‌కు చెందిన రెండు స్మార్ట్‌ఫోన్లు చైనాలో జనవరి 8న లాంచ్ కానున్నాయి. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 


Oppo Find X7 ఫీచర్లు, ప్రత్యేకతలు


Oppo Find X7 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ 1.5 కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ ఎలాంటి అంతరాయం లేకుండా స్మూత్‌గా పనిచేసేందుకు వీలుగా మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రోసెసర్ అమర్చారు. ఈ స్మార్ట్‌పోన్ 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్, 16 జీబి ర్యామ్ 256 జీబీ స్టోరేజ్, 512 జీబీ స్టోరేజ్, 1టీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ కెమేరా సెటప్ ఉన్నాయి. డివైస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌‌ఫోన్ స్కై బ్లాక్, సీఎండ్ స్కై, డిజర్ట్ మూన్ సిల్వర్, స్మోకీ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. 


Oppo Find X7 Ultra ఫీచర్లు, ప్రత్యేకతలు


ఒప్పో ఫోన్ 6.7 ఇంచెస్ 2కే ఓఎల్ఈడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరరేషన్ 3 ప్రోసెసర్ ఉంటుంది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇందులో కూడా 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ పోన్ అల్ట్రా పైన్ షాడో ఇంక్, సీ ఎండ్ స్కై, డిజర్ట్ మూన్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. 


Also read: Tata vs Maruti SUV: నెక్సానే కాదు ఆ టాటా మోటార్స్ కారు కూడా మారుతి బ్రెజాను దాటేసిందిగా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook