Phone Tapping: సాధారణంగా ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ అనేది అధికారికంగా పోలీసు శాఖ చేసే పని. ఎందుకంటే ఒకరి ఫోన్‌ను ట్యాపింగ్ చేసే అధికారం మరెవరికీ ఉండదు. పోలీసులు కూడా కేవలం అసాంఘిక శక్తుల ఫోన్లనే ట్యాపింగ్ చేస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో కొన్ని సాఫ్ట్‌వేర్‌ల కారణంగా ట్యాపింగ్ సాధారణమైపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని సూచనల ద్వారా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. మీరు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఏదైనా శబ్దం లేదా అంతరాయం గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందని సందేహించవచ్చు. ఎందుకంటే ఇదొక సంకేతం. ఫోన్ వినియోగించకున్నా వేడెక్కుతుంటే బ్యాక్ గ్రౌండ్‌లో మీ డేటా మీకు తెలియకుండా బదిలీ అవుతోందని భావించవచ్చు. 


అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం పెరిగినా అనుమానించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికోసం కొన్ని స్పై యాప్‌లు పనిచేస్తాయి. మీ పోన్ నుంచి డేటాను సేకరించేందుకు ఇంటర్నెట్ డేటా వినియోగిస్తారు. ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్‌కు గురవుతుంటే ఫోన్ పనితీరు మందగిస్తుంది. 


ఫోన్ వినియోగించకుండా ఉన్నప్పుడు కూడా ఫోన్ డిస్‌ప్లే ఆన్ కావడం, నోటిఫికేషన్ సౌండ్ రావడం గమనిస్తే కచ్చితంగా ఇది ట్యాపింగ్ లేదా ట్రాకింగ్‌ సంకేతమే. మీ ఫోన్ కెమేరా, మైక్రో ఫోన్ యాక్టివేట్ అయుంటే మీ ఫోన్‌ను అనధికారికంగా ఎవరో యాక్సెస్ చేస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఉండాలంటే తరచూ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలి. ఏ విధమైన అనుమానం కలిగినా, యాప్‌లకు ఇచ్చిన అనుమతులు తనిఖీ చేసి తరువాత తొలగించాలి. పబ్లిక్ వైఫై సాధ్యమైనంతవరకూ ఉపయోగించకపోవడం మంచిది.


Also read: New Hyundai Creta 2024: న్యూ ఎడిషన్‌ క్రెటా 2024 రాబోతోంది.. బ్లాక్‌ కలర్‌లో పిచ్చెక్కిస్తోంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook