Poco C55 Price Drops Suddenly: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో కూడా మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్ ప్రారంభమయ్యాయి. అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మొబైల్స్‌పై అమెజాన్ ప్రత్యేక ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే ప్రముఖ చైనీస్ కంపెనీ పోకో విడుదల చేసిన C మోడల్స్ 40 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఈ మోడల్స్ పై ఆధానంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్స్‌లో భాగంగా POCO C55 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రస్తుతం అమెజాన్‌లో POCO C55 రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొదటి వేరియంట్ ధర రూ. 11,999 కాగా.. రెండవ వేరియంట్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ధర రూ.13,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ను అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్ లో భాగంగా కొనుగోలు చేస్తే 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియన్ 48 శాతం తగ్గింపుతో రూ.7,299కే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 


ఎక్స్చేంజ్ ఆఫర్స్:
POCO C55 స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపుతో లభిస్తుంది. దీంతోపాటు దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లలో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత మొబైల్‌ను ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.6,900 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఆఫర్స్ అన్నీ పోను రూ. 399 కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్ పై ఉన్న మరిన్ని ఆఫర్స్ తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌ను సందర్శించాల్సి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.71 అంగుళాలు IPS LCD డిస్ల్పే
720 x 1650 పిక్సెల్స్‌ క్వాలిటీ
పాండా గ్లాస్ డిస్ల్పే ప్రోటక్షన్‌
Android 12, MIUI 13
ఆక్టా-కోర్ సిపీయూ
Mediatek MT6769Z Helio G85 చిప్‌సెట్    
మాలి-G52 MC2 జీపీయూ(GPU)
50 MP ప్రధాన కెమెరా    
5 MP సెల్ఫీ కెమెరా
1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
10W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter