Poco C55 Price: సంక్రాంతి సందర్భంగా POCO C55 రూ.6,000లకే పొందండి..డిస్కౌంట్ వివరాలు ఇవే..
Get Poco C55 Off Price: సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా Poco C55 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Get Poco C55 Off Price: సంక్రాంతి సందర్భంగా ప్రముక ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేస్తే దాదాపు 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా రెడ్ మీ, పోకో, ఒప్పో, పోకో బ్రాండ్స్‌కి సంబంధించిన మొబైల్స్ అతి చౌకగా లభిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన కొన్ని స్మార్ట్ ఫోన్స్ సగం ధరలకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లోని సంక్రాంతి సందర్భంగా POCO ఇటీవలే విడుదల చేసిన Poco C55 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 11,999 కాగా ప్రత్యేక సేల్ లో భాగంగా 45 శాతం తగ్గింపుతో రూ. 6,499కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5% వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ను పోను రూ. 6,000లకే లభిస్తుంది.
ఈ Poco C55 స్మార్ట్ ఫోన్ 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1650 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్ డిస్ప్లే కోసం పాండా గ్లాస్ పోటక్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ Poco C55 మొబైల్ MediaTek Helio G85 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం.. Arm Mali-G52 GPU సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని గేమింగ్ స్మార్ట్ ఫోన్‌గా కూడా వినియోగించవచ్చు.
ఈ మొబైల్ వర్చువల్ RAMకి కూడా సపోర్ట్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీనిని 5GB వరకు విస్తరించవచ్చు.. తర్వాత ఈ ర్యామ్ సైజ్ 11GB RAM వరకు పెరుగుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. Poco C55 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇక బ్యాక్ సెట్‌లో 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ 5000mAh బ్యాటరీతో 10w చార్జింగ్ సపోర్ట్ వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter