Poco F6 Price: 12GB ర్యామ్‌తో శక్తివంతమైన Poco F6 వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి!
Poco F6 Launch Date In India: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త పోకో లాంచ్ కాబోతోంది. ఇది 12GB ర్యామ్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్ కొత్త ఫీచర్స్‌తో వస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Poco F6 Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ POCO మార్కెట్‌లో తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మొబైల్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కంపెనీ యువతను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ర్యామ్‌తో పాటు ప్రాసెసర్ కలిగిన మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. మీరు కూడా పోకో కంపెనీ నుంచి అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మే 23వ తేది వరకు తప్పకుండా ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే పోకో తర్వలోనే లాంచ్ చేయబోయే POCO F6 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ POCO మే 23 సాయంత్రం 4:30 గంటలకు POCO F6 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది 2024 సంవత్సరంలో లాంచ్ చేసిన POCO F5 మొబైల్‌కి సక్సెసర్‌గా లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలస్తోంది. అయితే ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వస్తోంది. దీంతో పాటు ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ధర కూడా లీక్ అయ్యింది. దీనిని కంపెనీ అతి తక్కువ ధరలోనే రూ. 30 వేల లోపే కస్టమర్స్‌కి అందించబోతోంది.
POCO F6 5G ఫీచర్స్:
త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ కాబోయే POCO F6 5G స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 12GB ర్యామ్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. బెంచ్‌మార్క్ లిస్టింగ్ ప్రకారం..ఈ మొబైల్ డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ అందుబాటులోకి వస్తోంది. ఇది 50MP OIS ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ మొదట ఒకే రంగులో అందుబాటులోకి రాబోతోంది. ఇది గోల్డ్ కలర్ ఆప్షన్‌లో లభించనుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
డ్యూయల్ కెమెరా సెటప్
సోనీ LYT 600 సెన్సార్ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా
50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5,000 mAh బ్యాటరీని
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి