Poco M5 Big Billion Sale: మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఎదురుచూస్తున్నారా? అయితే మీరు అతి తక్కువ ధరతో మొబైల్ కొనేందుకు ఉపాయం ఉంది. సగం ధరకే సరికొత్త స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశం. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. అందుకే మీరు కొనుగోలు చేయాలనుకునే ఫోన్ బడ్జెట్ ధరలో కోరుకుంటే ఈ ఆఫర్ ద్వారా దాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ సేల్ ద్వారా పోకో (POCO) స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco M5
పోకో (POCO) M5 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా అతి తక్కువ ధరకే కొనొచ్చు. ఈ మొబైల్ ధర మార్కెట్లో ప్రస్తుతం రూ. 15,999 గా ఉంది. అయితే దీన్ని సగం ధర అనగా రూ. 7,777 కే కొనే అవకాశం ఉంది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 51 శాతం డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. 


దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డును కొనుగోలు సమయంలో వినియోగిస్తే.. రూ. 778 అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో కలిపితే ధర మరింత తగ్గుతుంది. దీంతో మొత్తంగా ఈ మొబైల్ ను రూ. 6,999 కి కొనవచ్చు. 


Also Read: టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ వచ్చేసింది.. మాస్ మహారాజ విశ్వరూపం చూసేయండి..


Poco M5 వివరాలు..
పోకో M5 స్మార్ట్ ఫోన్ గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొబైల్ లో 4 GB RAM, 64 GB Memory, మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్, 50 MP ట్రిపుల్ rear camera, 8 MP ఫ్రెంట్ కెమెరా, 6.58 ఇంచుల డిస్ ప్లే, 5000 mAh బ్యాటరీ పవర్, 4G సపోర్ట్ వంటి ఫీచర్స్ ను పోకో M5 కలిగి ఉంది. దీంతో పాటు 18 W ఫాస్ట్ ఛార్జింగ్, 90 Hz రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. 


ఈ పోకో స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై EMI కూడా అందుబాటులో ఉంది. నెలవారీ EMI కోసం రూ. 378 ఖర్చు చేస్తే.. 24 నెలల్లో ఇది మీ సొంతం అవుతుంది. అయితే అదే 18 నెలల్లో ఈ మొబైల్ సొంతం చేసుకోవాలనుకుంటే రూ. 500 EMI ఉంటుంది. ఇక ఏడాది పాటు EMI నిర్ణయించుకున్న వారు నెలకు కేవలం రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 9 నెలల టెన్యూర్ కోసం నెలవారీ రూ. 916.. 6 నెలల టెన్యూర్‌పై అయితే రూ. 1,350 కట్టాలి. ఇక మూడు నెలలకు అయితే రూ. 2,654 కట్టాల్సి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్రెడిట్ కార్డు లేదా ఫ్లిప్ కార్ట్ పే లేటర్ EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ,, తెలంగాణకు భారీ వర్ష సూచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook