Poco M6 5G Vs Poco M6 Pro 5G: ప్రస్తుతం మార్కెట్‌లో మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. యువత ఎక్కువగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన చౌక ధర కలిగిన మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే పోకో రెండు మిడిల్‌ బడ్జెట్‌ మొబైల్స్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్స్‌ Poco M6 Pro 5G, Poco M6 5G మోడల్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండు హై స్పీడ్‌ ప్రాసెసర్‌తో లభిస్తున్నాయి. అయితే వీటిని కొనుగోలు చేసే క్రమంలో చాలా మంది తికమక పడుతున్నారు. అయితే ఈ రెండిటిలో ఏ మొబైల్ గొప్ప పనితీరును కలిగి ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోకో M6 ప్రో 5G vs పోకో M6 5G: 
ముందుగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన డిస్‌ప్లే (Display) వివరాల్లోకి వెళితే.. పోకో M6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.79 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక పోకో M6 5G మొబైల్‌ ఇంతకముందు మోడల్ కంటే కొంత చిన్నదిగా ఉంటుంది. ఇది 6.53 అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రాసెసర్ పరంగా చూస్తే, పోకో M6 ప్రో మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో లభిస్తోంది. దీంతో పాటు పోకో M6 5G మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది.


ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ర్యామ్ & స్టోరేజ్ వివరాల్లోకి వెళితే.. పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొదటిది 4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవది 6GB ర్యామ్‌, 128GB/256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక పోకో M6 5G మొబైల్స్‌ కూడా రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. కెమెరా వివరాల్లోకి వెళితే..ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ డబుల్ కెమెరా సెటప్‌లో అందుబాటోకి వచ్చాయి. ఇందులో పోకో M6 ప్రో 5G మొబైల్‌ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ 48MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో లభిస్తోంది. ఈ మొబైల్స్‌ రెండు 8MP ఫ్రంట్ కెమెరాతో లభిస్తున్నాయి.  


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


ఇక ఈ పోకో M6 ప్రో 5G, పోకో M6 5G స్మార్ట్‌ఫోన్స్‌ బ్యాటరీ ఇతర వివరాల్లోకి వెళితే..పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇక పోకో M6 5G మొబైల్‌ 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందుబాటులో ఉంది. పోకో M6 ప్రో 5G మొబైల్‌ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. పోకో M6 5G మాత్రం MIUI 13పై రన్‌ అవుతుంది. ధర వివరాల్లోకి చూస్తే పోకో M6 ప్రో 5G మొబైల్‌ రూ.18,999తో ప్రారంభమవుతుంది. ఇక పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.14,999తో లభిస్తోంది. ధర పరంగా చూస్తే, పోకో M6 5G మొబైల్‌ బెస్ట్‌గా భావించవచ్చు. ఇక ఫీచర్స్‌ పరంగా పోకో M6 ప్రో 5G చాలా బెస్ట్‌..


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter