COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco X6 Price Cut: బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై ఏకంగా 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తోంది. అలాగే వాటిపై ఆధారంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా అమెజాన్‌లో ప్రముఖ చైనీస్ కంపెనీ పోకోకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన పోకోకు సంబంధించిన కొత్త మోడల్స్ మొబైల్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అయితే అమెజాన్లో పోకోకు సంబంధించిన ఏ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


ప్రస్తుతం అమెజాన్‌లో Poco X6 స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో లభిస్తుంది. ఈ మొబైల్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అలాగే ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ లో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.24,999లకు అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ ని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా 24% వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ పోనూ రూ.18,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్ పై ఆధానంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.


ఇక Poco X6 స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ ను కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకులకు సంబంధించినా క్రెడిట్ కార్డులను వినియోగించి EMI ఆప్షన్ చూజ్ చేసుకునే వారికి నో కాస్ట్ EMI కూడా లభిస్తోంది. దీంతోపాటు ఇతర క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అలాగే ఈ  Poco X6 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించాలనే వారు ముందుగా.. వారు వినియోగిస్తున్న పాత బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు ఈ కొత్త మొబైల్ పై రూ.18 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ కొత్త స్మార్ట్ ఫోన్ రూ.999కే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ పై ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి