COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco X6, X6 Pro Price: ప్రముఖ చైనీస్‌ టెక్‌ దిగ్గజం పోకో(Poco)కి మార్కెట్‌లో రోజురోజు డిమాండ్‌ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ మార్కెట్‌లోకి గురువారం మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఈ మొబైల్‌ను X సిరీస్‌తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి మార్కెట్‌లో ఈ కొత్త మొబైల్స్‌ Poco X6, Poco X6 Pro మోడల్స్‌లో లభించబోతున్నాయి. Poco కంపెనీ ఈ విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది. లాంచ్‌ అయిన ఈ మొబైల్స్‌ ధరేంటో, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ Poco X6, Poco X6 Pro స్మార్ట్‌ఫోన్స్‌ AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. ఈ Poco X6 సిరీస్‌ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని లైవ్‌ ఈవెంట్‌లో భాగంగా వెల్లడించారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ రూ. 20,000 నుంచి ప్రారంభమైంది. 


ప్రత్యేక ఆఫర్‌తో మార్కెట్‌లోకి..
Poco  కొత్త X6 సిరీస్ మిడ్‌రేంజ్ విభాగంలోకి మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. కంపెనీ శక్తివంతమైన F లైనప్‌తో పోలిస్తే టోన్డ్ డౌన్ ఫీచర్‌లను అందించింది. మొదటి సేల్‌లో Poco X6, Poco X6 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్స్‌కి కంపెనీ ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌లను కూడా అందిచబోంది. ముందుగా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లోకి అందుబాటులో రానున్నాయి. వీటిని కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించి పొందవచ్చు.  


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..


Poco X6 సిరీస్ స్పెసిఫికేషన్స్‌:
ఈ Poco X6, Poco X6 Pro స్మార్ట్‌ ఫోన్స్‌ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యాయి. అయితే కంపెనీ ఇంతక ముందే Poco X6 ప్రో మొబైల్‌ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో Redmi K70E మొబైల్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుదలైందని ప్రముఖ టిప్‌స్టార్స్‌ తెలిపారు. ఈ రెండు మొబైల్స్‌ 1229x2712 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఇవి రెండు AMOLED డిస్ప్లే కలిగిన గొరిల్లా గ్లాస్ ప్రోటక్షన్‌ను కలిగి ఉంటాయి.    


అదనపు ఫీచర్స్:
ట్రిపుల్ కెమెరా సెటప్
64MP బ్యాక్‌ ప్రధాన కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
Snapdragon 7s Gen 1 ప్రాసెసర్‌
ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్‌సెట్‌
5500mAh బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
స్టీరియో స్పీకర్ సెటప్
ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter