COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Powerful Features Vivo Upcoming Best Smartphone: ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు 5G కనెక్టివిటీ తో కూడిన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్ కి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని వివో కంపెనీ కూడా త్వరలోనే మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మోడల్ TENAA సర్టిఫికెట్‌కు సంబంధించిన డేటా బేస్ లో కనిపించింది. ప్రస్తుతం వివో మోడల్ V2314DA నంబర్‌కు సంబంధించిన ఓ స్మార్ట్ ఫోన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లిస్టింగ్ లో పేర్కొన్న వివరాల ప్రకారం రాబోయే వివో మొబైల్ ఏయే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ను కలిగి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


స్పెసిఫికేషన్స్‌ ఇవే:
త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోయే V2314DA మోడల్ నంబర్ స్మార్ట్‌ ఫోన్‌ 1080x2388 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.64 అంగుళాల పూర్తి HD+ LTPS LCD ప్యానెల్‌ డిస్ల్పేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ కంపెనీ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు యేచిస్తోంది. మొదట 8 GB, 12 GB వేరియంట్‌ను లాంచ్‌ చేసి ఆ తర్వాత 16 GB ర్యామ్‌ కలిగిన వేరియంట్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్‌ 128 GB, 256 GB, 512 GBతో పాటు 1 TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే దీని ప్రాసెసర్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


ఈ స్మార్ట్ ఫోన్‌ డబుల్‌ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లో రాబోతోంది. అంతేకాకుండా బ్యాక్‌ సెటప్‌లోనే LED ఫ్లాష్‌ లైట్‌ను అందిస్తోంది. కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్‌ బ్యాక్‌లో  50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెంట్‌ సెటప్‌లో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. ఈ మొబైల్‌లో బ్యాటరీ డ్యూయల్ సెల్ టెక్నాలజీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌  2440mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. 3C లిస్టింగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఇది 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక ఫీచర్స్‌లో భాగంగా IR బ్లాస్టర్, సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఇప్పటికే  TENAA లిస్టింగ్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫోటోన్‌ కూడా అప్లోడ్‌ చేశారు. ఇది డైమెన్షన్ 8200 చిప్‌సెట్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్‌ గత సంవత్సరం వచ్చిన iQOO Z8 స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుందని టాక్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్‌ను పోలి ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఈ V2314DA మోడల్ స్మార్ట్‌ఫోన్ Z8 సిరీస్‌లో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార సమాచారం.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter