Realme 11 Pro: ఇండియన్ మార్కెట్లోకి రియల్‌మీ 11 ప్రో స్మార్ట్‌ఫోన్స్.. 200MP కెమెరాతోపాటు అదిరిపోయే ఫీచర్లు..
Realme 11 Pro series: స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్‌మీ 11 ప్రో సిరీస్‌కు చెందిన 5G మెుబైల్స్ భారత మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫీచర్లు, ధర మెుదలైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme 11 Pro series: రియల్‌మీ 11 ప్రో సిరీస్‌కు చెందిన 5G స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. అవే రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో+. ఈ మెుబైల్స్ ఇప్పటికే చైనా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి దీనికి సంబంధించిన ఈవెంట్ యూట్యూబ్‌లో మరియు అన్ని సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ఈ ఫోన్లు మూడు రంగుల్లో లభించనున్నాయి. ప్రో మెుబైల్ ను ఈ నెల 15 నుంచి, ప్రో+ను 16 నుంచి అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్ సహా ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఎర్లీ యాక్సెస్ సేల్ కింద ఈ ఫోన్లను ఇవాళ సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య విక్రయానికి ఉంచనున్నారు. ఈరోజు ఈ ఫోన్‌లను ప్రీ-ఆర్డర్ చేసుకుంటే రూ. 4499 విలువైన వాచ్ 2 ప్రోని ఉచితంగా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫీచర్లు ఏంటి, ధర ఎంతో తెలుసుకుందాం.
రియల్‌మీ 11 ప్రో ఫీచర్లు, ధరలు
## 6.7-ఇంచీ అమోలోడ్ కర్వ్‌డ్ డిస్ ప్లే
## 120Hz రిఫ్రెష్ రేట్
## 6ఎన్‌ఎం ఆక్టాకోర్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
## 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
## 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
## బ్యాటరీ- 5,000mAh, 67W ఫాస్ట్ చార్జర్
## ఆండ్రాయిడ్ 13, యూఐ4.0 ఓఎస్
## 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999
## 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999
## 12GB + 256GB వేరియంట్ ధర రూ.27,999.
Also Read: Upcoming Phones June 2023: ఈ నెలలో లాంచ్ కాబోతున్న అదిరిపోయే స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
రియల్‌మీ 11 ప్రో+ ఫీచర్లు
## 200 మెగాఫిక్సల్ కెమెరా
## 30 మెగాఫిక్సల్ సెల్ఫీ కెమెరా
## 6ఎన్‌ఎం ఆక్టాకోర్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
## బ్యాటరీ- 5,000mAh, 67W ఫాస్ట్ చార్జర్
## ఆండ్రాయిడ్ 13, యూఐ4.0 ఓఎస్
## 8GB + 256GB ధర రూ.27,999.
## 12GB + 256GB ధర రూ.29,999
Also Read: Samsung Galaxy F54 5G: శాంసంగ్ గెలాక్సీ F54 5G ఫోన్ ఫీచర్స్ చూశారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook