COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme 12 Pro Price Cut In Flipkart: ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉందని మరోసారి నిరూపితమైంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రియల్ మీ 12 ప్రో సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ ఉండడంతో యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ వెబ్సైట్లలో ప్రీ ఆర్డర్ సేల్ స్టార్ట్ చేసిన నిమిషాల్లోనే మంచి స్పందన లభించింది. అయితే ఈ 12 ప్రో సిరీస్ లకు సంబంధించిన విక్రయాలు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇప్పటికే 12 ప్రో తో పాటు 12 ప్రో ప్లస్ ధరలను కూడా కంపెనీ ప్రకటించింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సెస్ సేల్ పేరుతో ప్రారంభమైంది. అయితే ఈ 12 ప్రో తో పాటు 12 ప్రో ప్లస్ ముందుగానే పొందడానికి రూ.5,999 వరకు చెల్లించి బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధరల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్‌ 12 ప్రో వేరియంట్ ను 13 శాతం తగ్గింపుతో రూ.25,999లకు విక్రయిస్తోంది.


ప్రస్తుతం ఇది రెండు (128+256) వేరియన్స్ లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఫ్లిప్కార్ట్ అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. దీంతోపాటు రూ.2,000 వరకు ఫ్లాట్ తగ్గింపును కూడా లభిస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ను వినియోగించి దాదాపు రూ. 1,200 వరకు తగ్గింపు పొందవచ్చు.


ఇక ప్రో ప్లస్ వేరియంట్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ రెండు (128+256) వేరియంట్స్‌లో లభిస్తోంది. 256 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.35,999కు అందుబాటులో ఉండగా.. ప్రత్యేక తగ్గింపులో భాగంగా 11 శాతం డిస్కౌంట్తో కేవలం ఈ మొబైల్ ను రూ. 31,999కే పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 28,499కే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ.21,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ మొబైల్ కేవలం రూ.7,000లోపే పొందవచ్చు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter