COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme C51 Price In India Flipkart: ప్రముఖ చైనీస్‌ టెక్‌ కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన C సిరీస్‌  స్మార్ట్‌ ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ వారం Realme C51 మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అతి శక్తివంతమైన ఫీచర్స్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లో లాంచ్‌ చేసింది రియల్‌ మీ..అయితే ఈ మొబైల్‌పై ఈ రోజు రెండు గంటల పాటు ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్‌ సేల్‌ జరబోతోంది. ఈ  సేల్‌ భాగంగా Realme C51 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ లైవ్‌ సేల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


భారత మార్కెట్‌లో కంపెనీ అధికారికంగా ఈ Realme C51 మొబైల్‌ ఫోన్‌ను సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే అధికారిక తేదికి ముందే ఈ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ రోజు Realme C51 స్మార్ట్‌ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో 2 రెండు గంటల ప్రత్యేక సేల్‌లో భాగంగా విక్రయించబోతోంది. అంతేకాకుండా సెప్టెంబర్ 8 సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య కూడా లైవ్‌ సేల్‌ భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను అందిచబోతోంది. 


Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  


ప్రత్యేక తగ్గింపుతో..
ప్రస్తుతం ఈ Realme C51 స్మార్ట్‌ ఫోన్‌ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే కంపెనీ ముందుగా ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ మొబైల్‌ను రూ.10,999లకు విక్రయించింది. అయితే కృష్ణాష్టమి ఫ్లిప్‌కార్ట్‌ 18య శాతం తగ్గింపుతో రూ.8,999లకే అందిస్తోంది. దీంతో పాటు అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దీనిని వినియోగించడానికి మీ దగ్గర ఉన్న  ICICI బ్యాంక్ లేదా SBI క్రెడిట్‌ కార్ట్‌లతో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు రూ. 500 వరకు ఫ్లాట్ తగ్గింపు పొందుతారు. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ రూ. 8,499లకే లభిస్తుంది.


Realme C51 స్పెసిఫికేషన్‌లు
6.7 అంగుళాల HD + డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్ 
560నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌
4GB వర్చువల్ ర్యామ్‌
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 
50MP AI కెమెరా 
5MP AI సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ
 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 


Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి