Realme GT 5 Mobile Features: స్మార్ట్ ఫోన్స్ తయారీలో అద్దిరిపోయే మోడల్స్ రూపొందించి దిగ్గజాలతో పోటీపడుతున్న రియల్‌మికి సంబంధించి తాజాగా మరో ఎగ్జైటింగ్ అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే చైనాలో రియల్ మి జిటి 5 విడుదల కానుందని రియల్‌మి చైనా మొబైల్ ప్రెసిడెంట్ జు ఖి చేజ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ రియల్‌మి జిటి 5 ఫోన్‌కి సంబంధించి సోషల్ మీడియాలో, మార్కెట్లో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లు ఇలా ఉండగానే తాజాగా రియల్ మి జిటి 5 స్మార్ట్‌ఫోన్ RAM గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. అదేంటంటే.. ఈ రియల్ మి జిటి 5 స్మార్ట్‌ఫోన్‌లో 24GB RAM వేరియంట్ కూడా ఉందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోన్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్స్‌తో పాటు, ఇంకొన్ని ఇతర ఫీచర్లు గురించి వీబోలో లీక్ అయ్యాయి. రియల్‌మి నుండే ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన  జిటి 3 స్థానంలో ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడింది.


రియల్ మి  చైనా ప్రెసిడెంట్ జు ఖి చేజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, రియల్ మి GT 5 ఫోన్ లో 24GB RAM వరకు ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌ పర్ ఫార్మెన్స్ మరింత పెంచడానికి క్వాల్ కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8th జనరేషన్ 2 SoC ఉపయోగించనున్నట్టు లీక్స్ కూడా ఇచ్చాడు. ఇందులో RAM 24GB వరకు ఉండటమే ఒక ఆశ్చర్యకరమైన విషయం కాగా.. అంతకు మించిన మరో ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే.. ర్యామ్ ఎలాగైతే స్పీడ్ గా పనిచేసేలా 24GB ఇస్తున్నారో.. అలాగే చార్జింగ్ స్పీడ్ కూడా అదే వేగాన్ని మ్యాచ్ అయ్యేలా 240W ఫాస్ట్ ఛార్జర్ అందిస్తున్నారు అని సమాచారం. 


ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే ఇది నిజంగానే ఎగ్జైటింగ్ న్యూస్ అవుతుంది కదా. స్మార్ట్ ఫోన్ మేకర్స్ చాలా మంది ఏదైనా కొత్త మొబైల్ ఫోన్‌ని లాంచ్ చేసిన ప్రతీసారి.. తమది ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఫోన్ అని చెబుతుంటారు కానీ అందులో అలాంటి ఎగ్జైటింగ్ ఫీచర్స్ పెద్దగా ఏమీ కనిపించవు. కానీ ఈ రియల్‌మి జిటి 5 లో మాత్రం నిజంగానే అమేజింగ్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉందని ఈ లీక్స్‌ని బట్టి తెలుస్తోంది.


ఇది కూడా చదవండి : Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే


రియల్ మి GT 5 ఫోన్ ఎప్పుడు లాంచ్ కాబోతోంది అనే విషయంలో జు ఖి చేజ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే రియల్‌మి జిటి 5 ఫోన్ కోసం వేచిచూస్తున్న వారంతా ఈ డీటేల్స్ తెలిశాకా.. ఫోన్ లాంచింగ్ డేట్ కోసం మరింత ఎగ్జైట్ అవుతున్నారు.


ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి