Realme Gt 6T Price leaked: 256GB స్టోరేజ్, 50MP Sony కెమెరాతో Realme Gt 6T రాబోతోంది.. ఫీచర్స్ లీక్!
Realme Gt 6T Price leaked: త్వరలోనే రియల్ మీ నుంచి మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
Realme Gt 6T Price leaked: ప్రముఖ ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme త్వరలోనే తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్‌ను అందిచబోతోంది. రెండు సంవత్సరాల తర్వాత Realme GT సిరీస్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది Realme GT 6T పేరుతో రాబోతోంది. ఈ మొబైల్ అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లాంచ్ తేదిని కూడా ప్రకటించింది. దీనిని మే 22న 12 గంటలకు లాంచ్ చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Realme GT 6T స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే realme.com, Amazon.in వంటి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. రియల్ మీ కంపెనీ ఈ మొబైల్‌ను మొట్టమొదటి సారిగా Snapdragon® 7+ Gen 3 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో పాటు ఇది ANTUTU స్కోర్ 1.5 మిలియన్‌కి పైగా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో Realme GT 6T ధర :
ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ధర రూ. 29,999తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ధర రూ. 31,999తో లభించబోతోంది. ఇక 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.35,999 నుంచి ప్రారంభమవుతుందని టిప్‌స్టర్ సంజు చౌదరి తెలిపారు. అలాగే మార్కెట్‌లోకి లాంచ్ అయితే వీటి ధరల్లో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Realme GT 6T ఫీచర్లు, స్పెషిఫికేషన్స్:
ఈ Realme GT 6T స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు టిప్‌స్టర్ సంజు చౌదరి వెల్లడించారు. ఇది OIS మద్దతుతో 50MP Sony IMX882 సెన్సార్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఇందులో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్ అతి శక్తివంతమైన 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీతో రాబోతోంది. ఇవే కాకుండా అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి