Realme Gt 5 Pro Launch Date In India: ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ రియల్ మీ త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. Realme GT 5 పేరుతో రియల్ మీ మార్కెట్లోకి ఆగస్టు 28న తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్ ను కంపెనీ ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన Realme GT 3 సక్సెసర్‌గా మొబైల్ ఫోన్ ను పరిచయం చేయబోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్, ధర, ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Realme GT 5 శక్తివంతమైన Qualcomm Snapdragon 8+ Gen ప్రాసెసర్‌తో రాబోతోందని కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు16GB LPDDR5X ర్యామ్ ను కూడా కలిగి ఉంటుంది. బ్యాటరీ ప్యాకప్ విషయానికొస్తే.. ఈ మొబైల్ ఫోన్ 240W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టుతో పాటు 4600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన డిజైన్ కూడా విడుదల చేసింది. Realme GT 5 సంబంధించిన ఫీచర్లు ఇతర వివరాలు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో పంచుకుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ వెనక ప్యానెల్ 'మిరాకిల్ గ్లాస్'తో రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  


ఈ స్మార్ట్ ఫోన్ ఇంతకు ముందు విడుదల చేసిన ఫైవ్ జీ మొబైల్ ఫోన్ల కంటే భిన్నంగా ఉండబోతుందని చైనీస్ వార్తా సంస్థలు తెలిపాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బాడీ విషయానికొస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పని దీని డిజైన్ కి  'లిక్విడ్ మెటల్ సిల్వర్' అని పేరు కూడా పెట్టింది. Realme GT 5 కెమెరా విషయానికొస్తే.. వెనక భాగంలో ఎల్ఈడి ఫ్లాష్ తో పాటు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ని అందించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ను 'ఫ్లోయింగ్ సిల్వర్ మిర్రర్' రంగు కలిగిన వేరియంట్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనేక రకాల కొత్త ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 


ఇతర ఫీచర్ల వివరాలు:
2160Hz వరకు PWM డిమ్మింగ్ రేట్‌తో ప్రో-XDR డైనమిక్ డిస్‌ప్లే
Qualcomm Snapdragon లోగోతో పాటు LED ఫ్లాష్ యూనిట్‌
పంచ్ స్లాట్
USB టైప్-సి పోర్ట్
మైక్రోఫోన్
1.46mm అల్ట్రా-నారో బెజెల్స్‌
108MP కెమెరా
1.5K రిజల్యూషన్
2000Hz టచ్ శాంప్లింగ్ రేట్
 240W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి