Realme Gt Neo 6 Pro: రియల్‌ మీ తర్వలోనే భారత మార్కెట్‌లోకి మరో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లు ఇంతక ముందు ఉన్న Neo సిరీస్‌లో Realme GT Neo 6, Realme GT Neo 6 Pro పేర్లతో రాబోతునట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లకు సంబంధించిన డిజైన్‌ను కూడా కంపెనీ అధికారికంగా సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. కెమెరా లేఅవుట్ విషయానికొస్తే..ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. Realme GT Neo 6ను కంపెనీ ఈ సంవత్సరంలోనే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌ సేల్స్‌లో  5 స్థానంలో ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Playfuldroid అందించిన నివేదికల ప్రకారం..TENAA అనే చైనా వెబ్‌సైట్‌లో Realme GT Neo 6, Realme GT Neo 6 Pro విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించగా.. RMX3823, RMX3820 మోడల్ నంబర్లతో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నాయని సమచారం. అంతేకాకుండా కంపెనీ త్వరలోనే లిస్టింగ్ స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను కూడా వెల్లడించబోతోంది. అయితే ఈ డిజైన్‌ గతంలో లీక్‌ అయిన రెండు ఫోటోల మాదిరిగానే ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది.


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  


Realme GT Neo 6, Realme GT Neo 6 Pro ఫీచర్లు:
✾ 6.74 అంగుళాల OLED డిస్‌ప్లే
✾ 16GB ర్యామ్‌ + 1TB స్టోరేజ్‌
✾ 9200+ SoC డైమెన్సిటీ 
✾ 100W ఛార్జింగ్ సపోర్ట్‌
✾ 5,000mAh బ్యాటరీ
✾ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC
✾ 144Hz రిఫ్రెష్ రేట్
✾ Android 13
✾ Realme UI 4.0
✾ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌
✾ LED ఫ్లాష్ మాడ్యూల్‌


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook