Realme Narzo N53 in India starts at Rs 8999: భారత మార్కెట్‌లో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు 'రియల్‌మీ'కి మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ మరియు ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నార్జో సిరీస్‌లో భాగంగా నార్జో ఎన్53 (Realme Narzo N53)ను గురువారం రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర 9 వేల రూపాయల లోపే. ఈ ఫోన్‌లో బిగ్ స్క్రీన్, అద్భుత కెమెరా, బలమైన బ్యాటరీ మరియు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Narzo N53 Price:
నార్జో ఎన్‌ సిరీస్‌లో రియల్‌మీ తీసుకొచ్చిన రెండో ఫోన్‌ 'నార్జో ఎన్53'. తక్కువ ధరలో 4జీ ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఇది సరైన ఎంపిక. నార్జో ఎన్‌53 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4 జీబీ,  64 జీబీ వేరియంట్‌ ధర రూ. 8999గా ఉంది. 6 జీబీ, 128 జీబీ వేరియంట్‌ ధరను రూ.10999గా ఉంది. 2023 మే 24న మధ్యాహ్నం 12 గంటల నుంచి నార్జో ఎన్‌53 విక్రయాలు ప్రారంభమవుతాయి.


Realme Narzo N53 Offers:
నార్జో ఎన్‌53 స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుపై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఫస్ట్‌ సేల్‌లో 4 జీబీ వేరియంట్‌ను రూ. 500, 6 జీబీ వేరియంట్‌ను రూ. 1000 డిస్కౌంట్‌పై విక్రయిస్తున్నారు. 2023 మే 22న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌తో స్పెషల్‌ సేల్‌ ఉంది.


Realme Narzo N53 Specs:
నార్జో ఎన్‌53 స్మార్ట్‌ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్‌ రేటు, అక్టాకోర్‌ యునిసోక్‌ T612 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌.. రియల్‌మీ యూఐ 4.0తో వస్తోంది. బ్యాక్ కెమెరా 50 ఎంపీ కాగా.. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉండగా.. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్‌ అవుతుంది. ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉండగా.. బ్లాక్‌, గోల్డ్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ లభిస్తుంది.


Also Read: CSK Case: ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై కేసు నమోదు!  


Also Read: XUV400 Vs Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ vs మహీంద్రా ఎక్స్‌యూవీ400.. బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.