Redmi A3x Price: రూ.5,676 ధరతో AI ఫీచర్స్ Redmi A3x మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Redmi A3x Price: త్వరలోనే భారత మార్కెట్‌లోకి Redmi A3x స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఇటీవలే పాకిస్థాన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi A3x Price: బడ్జెట్ సెగ్మెంట్లో అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మార్కెట్‌లోకి కొత్త మొబైల్ వచ్చింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ మార్కెట్‌లోకి తమ Redmi A3x స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో లాంచ్ అయిన Redmi A3 మొబైల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా ఇందులో కొత్త AI ఫీచర్స్‌తో కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ డిప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో లభిస్తోంది. రెడ్‌మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, గ్రీన్‌తో పాటు వైట్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Redmi A3x స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కూడిన డిప్లేతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 6.71 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌లో డిసి డిమ్మింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. అలాగే డిస్ల్పే గ్లాస్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది 3GB ర్యామ్ సెటప్‌తో లభిస్తోంది. అలాగే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. రెడ్‌మీ ఈ మొబైల్‌లో ర్యామ్‌ను పెంచుకోవడానికి అదనంగా 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది.
ఈ Redmi A3x మొబైల్ Unisoc T603 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వచ్చింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి, దీని బ్యాక్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ డ్యూయల్ AI కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే, ఇది 5 మెగాపిక్సెల్ కెమెరాతో లభిస్తోంది. ఇంది ప్రీమియం ఆప్డేటెడ్ Android 14 ఆధారిత OSలో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ, 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అలాగే రెడ్‌మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో భద్రత ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది పూర్తి బయోమెట్రిక్ భద్రతతో వస్తోంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సెటప్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌ను పాకిస్థాన్‌లో ఇటీవలే విడుదల చేసింది. అయితే భారత్‌లో కూడా త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ ధర విషయానికొస్తే, ధర PKR 18,999లతో సేల్ అవుతోంది. ఇక భారత్‌లో ఈ మొబైల్ ధర రూ.5,676 ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి