Redmi Note 13 Pro: రేర్ కలర్‌తో మార్కెట్లోకి మరో Redmi మొబైల్.. ఫీచర్స్ ఇవే!
Redmi Note 13 Pro Olive Green color: ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో త్వరలోనే మార్కెట్లోకి Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi Note 13 Pro Olive Green Color: మార్కెట్లో మంచి పేరున్న టెక్ స్మార్ట్ ఫోన్ కంపెనీల్‌ల్లో Redmi ఒకటి. ఈ మొబైల్ కంపెనీ అతి తక్కువ ధరలోనే మంచి మంచి మొబైల్స్‌ను విక్రయించడంతో చాలామంది యువత దీనికి ఫాన్స్ అయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకొని Redmi కంపెనీ ప్రతి సంవత్సరం అతి తక్కువ బడ్జెట్లో కనీసం నాలుగు నుంచి ఐదు స్మార్ట్ ఫోన్స్ అయినా విక్రయిస్తూ వస్తోంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్‌ను తయారు చేస్తోంది. గత సంవత్సరం మార్కెట్‌లో లాంచ్ అయిన నోట్ సిరీస్ మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించడంతో కంపెనీ ఇదే సిరీస్‌పై భవిష్యత్తు ఫోకస్ పెట్టింది. దీంతో కంపెనీ ఈ నోట్ సిరీస్ నుంచి కొత్త కొత్త మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అలాగే ఈ కంపెనీ ఇటీవలే నోట్ 13 ప్రో సిరీస్‌ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఈ Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్‌ను అద్భుతమైన కలర్ ఆప్షన్‌లో మరోసారి విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు, లాంచింగ్ తేదీని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆలివ్ గ్రీన్ కలర్‌ను మార్కెట్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది ఈ కలర్‌తో కూడిన ఎలక్ట్రిక్ వస్తువులను ఎక్కువగా కొనేందుకు ఇష్టపడతారు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్‌ను ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అమెజాన్ ఇండియాలోని లైవ్ మైక్రోసైట్‌లో లైవ్ అవుతున్నాయి. ముందుగా ఈ మొబైల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసి ఆ తర్వాత గ్లోబల్ లాంచింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన తర్వాత 1.5 కోట్ల యూనిట్లకు పైగా అమ్ముడవ్వగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ కలర్ వేరియంట్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ గతంలోనే న్యూ ఇయర్ స్పెషల్ ఎడిషన్ పేరుతో చైనాలో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోయే ఆలివ్ గ్రీన్ కలర్ Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఫీచర్‌ని కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఇది అద్భుతమైన మరెన్నో ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన Redmi Note 13 Pro 5G ఫీచర్ల మాదిరిగానే ఉంటాయని కొందరు టిప్ స్టర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 9న విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Redmi Note 13 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
1800 నిట్ హై బ్రైట్‌నెస్
డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్
Snapdragon 7s Gen 2 చిప్‌సెట్
200-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా
2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా
5100mAh బ్యాటరీ
67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Android 14 ఆధారిత HyperOS
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి