Jio AirFiber Launch: వినాయక చవితి కానుకగా జియో ఎయిర్ ఫైబర్ లాంచ్‌కు అంతా సిద్ధం
Jio AirFiber Launch: ప్రముఖ టెలీకం, బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్ రిలయన్స్ జియో సరికొత్త ఎయిర్ ఫైబర్ లాంచ్‌కు రంగం సిద్దం చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైర్‌లెస్ ఇంటర్నెట్ ఎయిర్ ఫైబర్ లాంచ్‌కు సన్నాహాలు చేస్తోంది.
Jio AirFiber Launch: రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశపెడుతున్న ఎయిర్ పైబర్ సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ వినాయక చవితి ప్రత్యేకంగా సెప్టెంబర్ 18న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్ది కానుకగా ముకేష్ అంబానీ అందించనున్నారు.
ఎయిర్ ఫైబర్ అనేది వైర్‌లెస్ ఇంటర్నెట్ రంగంలో సూపర్‌ఫాస్ట్ 5జీ సేవలందించే సిస్టమ్. ఇప్పటికే ఎయిర్‌టెల్...ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ పేరుతో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించింది. అందుకే రిలయన్స్ జియో ఇప్పుడు నేరుగా ఎయిర్ పైబర్ విషయంలో ఎయిర్‌టెల్‌తో పోటీ పడనుంది. కాంతి వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని రిలయన్స్ జియో చెబుతోంది.
జియో ఎయిర్ ఫైబర్ ప్రత్యేకత ఏంటి
జియో ఎయిర్ ఫైబర్ అనేది వైర్‌లెస్ డివైస్. జియో 5జి నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ సేవలు పొందే యూజర్లు 1 జీబీపీఎస్ వరకూ స్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ఇది వైఫై 6 టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ డివైస్ WAN,LAN,USB,power portకు కూడా అనుసంధానమౌతుంది. పూర్తి స్థాయిలో జియో ఎయిర్ ఫైబర్ ప్రత్యేకతలు ఇంకా తెలియదు.
జియో ఎయిర్ పైబర్ ధర ఇతర వివరాలు లాంచ్ రోజునే తెలుస్తాయి. కానీ 6 వేల రూపాయలతో ప్రారంభం కావచ్చని అంచనా. రోజుకు దేశవ్యాప్తంగా 1 లక్షా 50 వేల జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్లను ముకేష్ అంబానీ టార్గెట్‌గా పెట్టుుకున్నారంటే జియో ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్దం చేసుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులో వస్తే 5జి ఆధారిత ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో పొందేందుకు వీలవుతుంది. రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ పోటీ నేరుగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్ ఫైబర్‌తో ఉంటుంది.
Also read: iPhone 15 Series Launch: ఆపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, ఐఫోన్ 15 వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook