Samsung Galaxy F15 Price: చీప్ ధరకే 6,000mAh జంబో బ్యాటరీతో Galaxy F15 మొబైల్ రాబోతోంది..ఇక RealMe, Redmiకి బైబై!
Samsung Galaxy F15 Expected Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి త్వరలోనే సంసాంగ్ గుడ్ న్యూస్‌ను అందిస్తుంది. హై ఎండ్ ఫీచర్స్ కలిగిన మొబైల్‌ను త్వరలోనే సంసాంగ్ విడుదల చేయబోతోంది.
Samsung Galaxy F15 Expected Price: ప్రముఖ టెక్ కంపెనీ సాంసంగ్ త్వరలోనే మరో శుభవార్త తీసుకు రాబోతోంది. సాంసంగ్ ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ ఎఫ్ సిరీస్‌లో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కంపెనీ అధికరికంగా మొబైల్ మోడల్‌ను వెల్లడించకపోయిన పలువురు టిప్‌స్టర్స్ తెలిపిన వివరాల ప్రకారం..Samsung Galaxy F15 మోడల్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్‌లు, లాంచ్ తేదీ, ఇతర వివరాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీకైన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విడుదల తేది, లీకైన ఫీచర్లు:
సాంసంగ్ కంపెనీ ఈ Galaxy F15 స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేయబోతున్నట్లు Smartprix నివేదిక పేర్కొన్నారు. దీంతో పాటు ఇదే iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన టీజర్, పోస్టర్ కూడా రివీల్ అయ్యింది. లీక్ అయిన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పూర్తి-HD ఫ్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది సూపర్ AMOLED డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 6100+ SoC, Mali G57 జిపియూతో అందుబాటలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14పై పని చేస్తుంది. అలాగే ఐదు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ఫీచర్, 4 సంవత్సరాల S అప్‌గ్రేడ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఈ Galaxy F15 స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. మొబైల్ భద్రత కోసం సైడ్ మౌంట్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా బ్లూటూత్ v5.1, Wi-Fi 5, 5G, NFC, GPS వంటి కనెక్టీవిటీలను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్ ధర వివరాల్లోకి వెళితే, కంపెనీ ఈ మొబైల్‌ను భారత మార్కెట్‌లో రూ. 15,000 లోపే అందుబాటులోకి ఉంచబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter