Samsung Galaxy F15: Samsung Galaxy F15 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు ప్రీమియం ఫోన్‌ను తలదన్నేలా ఉంటాయి. ధర మాత్రం డిస్కౌంట్ తరువాత చాలా తక్కువకే లభించనుంది. కేవలం 12 వేలకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పీచర్లు, ఇతర ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy F15 అనేది 5జి సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్. ఇది 6.5 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 2340-1080 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో వైఫై, బ్లూటూత్, జీపీఎస్ ఫీచర్లు ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. ఇందులో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ఉంది. బ్యాటరీ సామర్ద్యమైతే ఏకంగా 6000 ఎంఏహెచ్ ఉంది. 


ఇక Samsung Galaxy F15 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 5 మెగాపిక్సెల్ కెమేరా, 2 మెగాపిక్సెల్ కెమేరాతో త్రిబుల్ కెమేరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 13 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా 18 శాతం డిస్కౌంట్ అనంతరం 13,998 రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 1750 రూపాయలు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ కేవలం 12, 248 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.


Also read: Union Budget 2024: ఉద్యోగులకు శుభవార్త, స్టాండర్డ్ డిడక్షన్ 1 లక్ష రూపాయలకు పెరగనుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook