COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy M14 5G Price: ఛీప్‌ అండ్‌ బెస్ట్‌లో స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది రూ. 15,000లోపు 5G స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం మేము అద్భుతమైన ఆఫర్స్‌ను తీసుకొని వచ్చాం. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో Samsung Galaxy M14 5G మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే..అతి తక్కువ ధరలో లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ ఎంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్టులో Samsung Galaxy M14 5G మొబైల్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. రెండు వేరియంట్స్‌ 50MP ట్రిపుల్‌ కెమెరా సెట్‌అప్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిప్‌లో బ్యాంక్‌ ఆఫర్స్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి మరిన్ని ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


సంసాంగ్‌ Galaxy M14 5G 4జిబి RAM వేరియంట్ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ రూ. 14,790లకి అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను ఏదైనా బ్యాంకు కార్డు నుంచి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేస్తే రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా బిల్‌ చెల్లిస్తే రూ. 750ల దాకా తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇదే క్రెడిట్‌తో EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే రూ. 1,250 తగ్గింపు పొందవచ్చు. అన్ని డిస్కౌంట్స్‌ పోను రూ. 3,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 


Galaxy M14 5G ఫీచర్లు:
❃ HD+ రిజల్యూషన్‌
❃ 6.6 అంగుళాల LCD డిస్‌ప్లే
❃ Exynos 1330 ప్రాసెసర్ 
❃ Android 13 ఆధారంగా OneUI కోర్ 5.0
❃ 6000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
❃ 50MP బ్యాక్ కెమెరా లెన్స్
❃ 2MP డెప్త్ సెన్సార్ కెమెరా
❃ 2MP మాక్రో కెమెరా లెన్స్
❃ 13MP సెల్ఫీ కెమెరా


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి