Samsung Galaxy S24 Ultra Release Date: సాంసంగ్‌ గెలాక్సీ S సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వీటి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని S సిరీస్‌లోనే మరో మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ  మోడల్‌ మొబైల్‌ను Galaxy S24 Ultra అనే నామకరణంతో మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ లీకై నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకముందు ఉన్న సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ల కంటే అప్డేట్ ఫీచర్స్ తో రాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్లాట్‌ఫారమ్ Xలో Samsung Galaxy S24 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లను షేర్‌ చేశారు. సాంసంగ్‌ Galaxy S24 సిరీస్‌ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో భారత మార్కెట్‌ విడుదలయ్యే ఛాన్స్‌ ఉందని అన్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌  క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌  200 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతోందన్నారు. ఇక సెల్ఫీ, వీడియో కాలింగ్‌ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


అన్నింటికంటే ముఖ్యమైన ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే..S24 అల్ట్రా ఆక్టా కోర్ Qualcomm Snapdragon 8 Gen 3 లేదా Exynos 2400 చిప్‌సెట్‌పై పని చేస్తుందని సమాచారం. సాంసంగ్‌ కంపెనీ Exynos 2400 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్స్‌ను యూరోపియన్ మార్కెట్‌లో మొదట విడుదల చేసే అవకాశాలున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌తో పాటు సాంసంగ్‌ మరో కొన్ని మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసేందుకు యోచిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 


ఇతర ఫీచర్లు:
✾ 5000mAh బ్యాటరీ 
✾ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 
✾ M13 OLED స్క్రీన్‌
✾ 2000 నిట్‌ల బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ 
✾ Exynos 2400 ప్రాసెసర్ 
✾ 200 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి