Samsung S21 Fe Dead Cheap Price: ప్రముఖ ఈ కామర్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తోంది. ఇటీవలే లాంచ్ అయిన అన్ని స్మార్ట్ ఫోన్లపై దాదాపు 30% డిస్కౌంట్ ను అందజేస్తోంది ఫ్లిప్కార్ట్. గత సంవత్సరంలో సాంసంగ్ ఎస్ సిరీస్ తో విడుదల చేసిన S21 FE పైఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సాంసంగ్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయం కాదు భావించవచ్చు. ఈ సేల్ లో S21 FE కొనుగోలు చేస్తే 46 శాతం దాకా డిస్కౌంట్ ఉండవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను ఎలా కొనుగోలు చేస్తే మరింత డెడ్ చీప్ ధరకు లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాంసంగ్ కంపెనీ S21 FE ని మార్కెట్లో రూ. 74,999 లకు విక్రయించగా.. ఫ్లిప్‌కార్ట్ సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని 46 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 39, 999లకే లభిస్తుంది. అడిషనల్ గా ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్ ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా బిల్లు చెల్లిస్తే రూ.1,250ను డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో అన్ని బ్యాంక్ ఆఫర్స్ పోను ఈ సాంసంగ్ S21 FE  మొబైల్ రూ. 37,499 లకే లభిస్తోంది.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


ఎక్స్చేంజ్ ఆఫర్:
సాంసంగ్ S21 FE  మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ లో భాగంగా ఎక్స్చేంజ్ చేస్తే కండిషన్ను బట్టి డిస్కౌంట్ పొందవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే దాదాపు రూ. 35,000 దాకా ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్లు ఫోను రూ. 2,499 లకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటేనే పైన పేర్కొన్న విధంగా డిస్కౌంట్ లభిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగా లేకపోతే అనుకున్న దాని కంటే తక్కువగా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook