ప్రస్తుత రోజుల్లో ఫుడ్ వ్యాపారానికన్నా లాభం ఇచ్చేది ఏ వ్యాపారం లేదేమో. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు బిజీ లైఫ్ స్టైల్ లో ఉన్న వారందరూ బయట తిండి అలవాటు పడిపోయారు..
దానికి తగ్గట్టు ఫుడ్ బిజినెస్ చేసేవారు ఎన్నో ఆలోచనలతో కొత్తగా ముందుకు వస్తున్నారు. ఎన్నో హోటల్స్ ఉన్నప్పుడు మనము ఒక దగ్గరికి ఎందుకు వెళ్తాము.. కేవలం అక్కడ ఏదన్నా కొత్తగా ఉంటే లేదా రుచి బాగుంటే.. కాగా ఇప్పుడు అందరూ కొత్త కొత్త వెరైటీలు ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య ట్రెండ్ అవుతుండేది సెన్సార్ పానీ పూరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 ఇది పుట్టింది ఎక్కడో అనుకుంటే మాత్రం పొరపాతే. సెన్సార్ పానీ పూరి మన ఆంధ్రప్రదేశ్లోనే మొదలైంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాజు పానీపూరి వ్యాపారం ఈ మధ్యనే ప్రారంభించారు. అయితే ఈ వ్యాపారం సాధారణంగా అన్ని చోట్ల దొరికే పానీపూరీలా కాకుండా కొత్తగా ఏమన్నా చేయాలన్న ఆలోచన రాజుకి రావడంతో అక్కడ మొదలైంది సెన్సార్ పానీపూరీ. చూడటానికి అలానే వినడానికి కూడా వింతగా ఉండటంతో ప్రజలు అక్కడ పానీపూరీ తినేందుకు ఉత్సాహంగా వస్తున్నారని వ్యాపారి తెలిపాడు.


ఇందులో వెరైటీ ఏమిటి అంటే మామూలు పానీపూరి అక్కడ ఉన్న మనిషి అందరికీ పెడుతూ రావాలి. దానివల్ల మనం ఒక పానీ పూరి తిని మరో పానీ పూరి మన ప్లేట్ లోకి రావడానికి కొద్దిసేపు పట్టొచ్చు. కానీ ఇక్కడ అలా లేదు వచ్చిన వారిని ఎక్కువ సమయం వెయిట్ చేయించకుండా త్వర త్వరగా పానీపూరీలు సర్వైపోతాయి.  పానీపూరి ఆర్డర్ చేసిన వెంటనే పూరీలో బఠాణీ పప్పు పెట్టి ఇస్తారు. ఆ పూరీని అక్కడే ఉన్న చిన్న పైప్ వద్దకు తీసుకెళ్తే.. సెన్సార్ డిస్పెన్సర్ ద్వారా పానీ వచ్చి పూరీలో పడిపోతుంది.


దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఎంతమంది కస్టమర్లు ఉన్నా వచ్చినవారికి లేట్ అవ్వదు. ఇక ఇలా త్వరగా సర్వ్ చేస్తుండడంతో ఫుడ్ లవర్స్ కూడా ఇక్కడికే వస్తున్నారు. గోదావరిఖని జూనియర్ కాలేజీకి ఎదురుగా హైజెనిక్ పానీపూరీ చాట్, స్నాక్స్ పాయింట్ పేరుతో రాజు ఇది స్టార్ట్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.



అంతేకాదు కరోనా టైం నుంచి ఒకరికి ఒకరు దూరం ఉండడం అలానే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమైంది. అలాంటి పాయింట్స్ అన్ని తన మైండ్లో పెట్టుకొని ఈ కొత్త విధానాన్ని ప్రారంభించినట్లు రాజు తెలిపారు. ఇలా సెన్సార్ పానీ పూరి తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ రాజుని చూసిన వారందరూ తమ తమ ప్రదేశాల్లో కూడా ఈ సెన్సార్ పానీ పూరిని స్టార్ట్ చేసేశారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook