Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండి
Smartphone Usage Tips: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అధికమైంది. ప్రతి పని స్మార్ట్‌ఫోన్‌తో జరుగుతుండటంతో అందరికీ ఇదే ఆధారమౌతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ సైబర్ మోసాలు కూడా అధికమౌతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు నిపుణులు.
Smartphone Usage Tips: స్మార్ట్‌ఫోన్ల వినియోగం విషయంలో అమెరికా జాతీయ భద్రతా సంస్థ కీలకమైన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో స్మార్ట్‌ఫోన్ల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, సూచనల గురించి వివరంగా ఉంది. సైబర్ మోసాలు, హ్యాకింగ్ నుంచి స్మార్ట్‌ఫోన్లను కాపాడుకునేందుకు ఈ సూచనలు ఉపయోగపడనున్నాయి.
స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్, సైబర్ ఎటాక్స్ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ముఖ్యంగా సైబర్ దాడులకు గురి కాకుండా ఉండేందుకు వారంలో ఒక్కసారైనా మీ పోన్ స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన యాప్‌లను వైఫై నెట్‌వర్క్ ద్వారా మీ ఫోన్లలో ప్రవేశపెట్టే అవకాశముంది. రిమోట్ యాక్సెస్ ద్వారా మీ ఫోన్‌లోని విలువైన, సున్నితమైన డేటాను తస్కరించే అవకాశముంది. అందుకే ఫోన్‌ను అప్పడప్పుడూ స్విచ్ ఆఫ్ చేయడం, రీ స్టార్ట్ చేయడం చేస్తుండాలి.
ఇక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అందించే అప్‌డేట్స్ ఎప్పటికప్పుుడు పాటిస్తుండాలి. యాప్ స్టోర్ నుంచి మాత్రమే కావల్సిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మెయిల్ లేదా టెక్స్ట్ మెయిల్ ద్వారా వచ్చే లింక్స్ క్లిక్ చేయకూడదు. పబ్లిక్ వైఫై వినియోగించకపోవడమే మంచిది. బయట ఉన్నప్పుడు వీలైంతే బ్లూటూత్ ఆఫ్ చేయడం మంచిది. ఫలితంగా అనధికారికంగా కనెక్ట్ అయ్యే డివైస్‌లు నియంత్రించవచ్చు.
బయోమెట్రిక్, ఫేసియల్ గుర్తింపు వ్యవస్థ తప్పకుండా ఉండాలి. పాస్‌వర్డ్ కూడా బలంగా ఉండటం మంచిది. అవసరం లేనప్పుడు మీ ఫోన్‌లో ఉండే లొకేషన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సూచనలు పాటించడం ద్వారా చాలావరకూ మీ స్మార్ట్‌ఫోన్లను సైబర్ మోసాలు, హ్యాకింగ్ నుంచి కాపాడుకోవచ్చు.
Also read: No Tax Income: ఎలాంటి ఆదాయాలపై ట్యాక్స్ ఉండదో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook