COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Suddenly Drops Honor 90 5G Price: ప్రస్తుతం చాలామంది యువత అధిక మెగాపిక్సల్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. టెక్ కంపెనీలు కూడా ప్రీమియం బ్యాక్ కెమెరా కలిగిన మొబైల్స్‌ను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన 200 మెగాపిక్సల్ కలిగిన హానర్ 90 (Honor 90 5G) మొబైల్‌కి మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సేల్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే స్టాక్ అమ్ముడు అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ సాంసంగ్ ఇటీవలే విడుదల చేసిన కెమెరా మొబైల్స్ కంటే ఎక్కువ మెగాపిక్సల్ కలిగి ఉంటుంది. అందుకే యువత ఎక్కువగా ఈ మొబైల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డీల్ ను అందిస్తోంది. ఈ డీల్లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 40 శాతం కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది.


ప్రస్తుతం హానర్ 90 (Honor 90 5G) స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మొదటిది 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటే, రెండవ వేరియంట్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ లో 12 GB + 512 GB వేరియంట్ అసలు ధర MRP రూ. 49,999 కాగా.. ఈ మొబైల్‌పై ఉన్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 44 శాతం తగ్గింపుతో కేవలం రూ.27,999కే పొందవచ్చు. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 


బ్యాంక్ ఆఫర్స్:
ఈ Honor 90 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన BOBCARD క్రెడిట్ కార్డు తో బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు సిటీ బ్యాంక్, వన్ కార్డ్, HSBC బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించిన అనుసంధాన బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ హానర్ 90 మొబైల్ రూ.26,499కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై మరెన్నో ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.7 అంగుళాలు AMOLED డిస్ల్పే
HDR10+, 1600 నీట్స్‌ పీక్
1200 x 2664 పిక్సెల్‌
Android 13, MagicOS 7.1
Qualcomm Snapdragon 7 Gen 1 చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU
అడ్రినో 644 GPU
ట్రిపుల్ కెమెరా సెటప్‌
200 MP ప్రధాన కెమెరా
12 MP కెమెరా
2 MP, f/2.4 కెమెరా
4K వీడియో ఆప్షన్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
66W వైర్డ్ ఛార్జింగ్
5W రివర్స్ వైర్డు ఛార్జింగ్


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter