Realme Narzo 70 Pro Launch: 50 మెగాపిక్సెల్ సోనీ కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ నేడే, ప్రీ సేల్ ఆఫర్లు ఇలా
Realme Narzo 70 Pro Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన ఫోన్ ఇవాళ లాంచ్ కానుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కంపెనీ కెమేరాతో, 256 జీబీ స్టోరేజ్ సామర్ద్యంతో లాంచ్ కానున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme Narzo 70 Pro 5G లాంచ్ డేట్ ఖరారైంది. ఇవాళ మద్యాహ్నం నుంచి అమెజాన్ వేదికపై అందుబాటులో రానుంది. మీరు కూడా ఈ ఫోన్ కొనుగోలు కోసం ఆలోచిస్తుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 4,299 రూపాయలు లబ్ది పొందవచ్చు. ఫస్ట్ సేల్‌లో భాగంగా కొన్ని యాక్సెసరీస్ ఉచితంగా అందనున్నాయి. ఈ ఫోన్ ఫీచర్ల గురించి పరిశీలిద్దాం.
Realme Narzo 70 Pro 5G మొట్టమొదటిసారిగా హారిజన్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. అంతకుమించి ఈ ఫోన్‌లో రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ సౌకర్యం ఉంటుంది. ఎయిర్ జెస్టర్ వంటి అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెనరేషన్ 2 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12 జీబీ ర్యామ్ కావడంతో పనితీరు అత్యంత వేగంగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే సోనీ కంపెనీకు చెందిన 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ప్రారంభమౌతుంది. 8 జీబీ ర్యామ్ ప్రారంభం కావడంతో ఫోన్ ప్రోసెస్ చాలా వేగంగా ఉంటుంది. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 67 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఇవాళ ధర ఎంతనేది తెలుస్తోంది. కానీ బడ్జెట్ అనువుగానే ఉండవచ్చని అంచనా. రియల్‌మి నార్జో 70 ప్రో ప్రీ సేల్‌లో భాగంగా T300 ఇయర్ బడ్స్ ఉచితంగా లభిస్తాయి. వీటి మార్కెట్ విలువ 2,299 రూపాయలు. వీటితోపాటు ఇంకొన్ని యాక్సెసరీస్ ప్రయోజనాలు పొందవచ్చు.
Also read: Costly Gift: నాలుగు నెలల బుడ్డోడికి 240 కోట్ల బహుమతిచ్చిన తాతయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook