COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tecno Pop 9 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ టెక్నో మార్కెట్‌లోకి కొత్త కొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇందులో చాలా వరకు ప్రీమియం ఫీచర్స్‌ కలిగి ఉంటున్నాయి. అయితే మార్కెట్‌లో ఈ కంపెనీ తమ బ్రాండ్‌ను మరింత ప్రమోట్‌ చేసుకోవడానికి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను కూడా డెడ్‌ చీప్‌ ధరల్లోనే విక్రయిస్తూ వస్తోంది. గతంలో విడుదలైన మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇదిలా ఉంటే ఇటీవలే విడుదలైన టెక్నో పాప్ 9 5G (TECNO POP 9 5G) స్మార్ట్‌ఫోన్‌ కూడా అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.


మార్కెట్‌లో టెక్నో పాప్ 9 5G (TECNO POP 9 5G) స్మార్ట్‌ఫోన్‌కు కంపెనీ మంచి డిమాండ్‌ క్రెయోట్‌ చేయడానికి అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. మార్కెట్‌లో ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులో మొదటి స్టోరేజ్‌, రెండవ స్టోరేజ్‌ వేరియంట్ ధరలు సేమ్‌ టూ సేమ్‌ ఉన్నాయి. మార్కెట్‌లో దీని MRP ధర రూ.11,999తో లభిస్తోంది. అయితే ఇప్పటికే కంపెనీ దీనిపై అమెజాన్‌లో ప్రీ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాకుండా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్‌ చేసేవారికి భారీ డిస్కౌంట్‌తో రూ.9,499కే పొందవచ్చు.


ఈ టెక్నో పాప్ 9 5G (TECNO POP 9 5G) స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,250 తగ్గింపు లభిస్తుంది. అలాగే కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌పై నో కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోనూ రూ.8,249కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
MediaTek Dimensity 6080 5G ప్రాసెసర్
6.78-అంగుళాల HD+ IPS LCD డ్యూయల్-డ్రాప్-నోచ్ డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేటు డిస్ప్లే
50MP ప్రధాన కెమెరా,
2MP డెప్త్ సెన్సార్,
8MP ఫ్రంట్ కెమెరా
microSD కార్డ్ స్లాట్
4GB/6GB ర్యామ్, 64GB/128GB ఇంటర్నల్‌ స్టోరేజ్
5000mAh బ్యాటరీ 
18W ఫాస్ట్ చార్జింగ్
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C పోర్ట్ కనెక్టీవిటీలు
ఫింగర్ప్రింట్ సెన్సార్, అక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.