Tecno Spark 20 Pro 5G Price: రూ.20 వేలలోపే మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ మొబైల్.. లాంచ్ తేది అప్పుడే..
Tecno Spark 20 Pro 5G Price: త్వరలోనే మార్కెట్‌లోకి TECNO Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది అతి తక్కువ ధరలోనే లభించబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Tecno Spark 20 Pro 5G Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ TECNO మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. టెక్నో లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్ స్పార్క్ 20 ప్రో 5G పేరుతో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. అంతేకాకుండా కంపెనీ భారత్‌లో విడుదల తేదిని కూడా అనౌంస్ చేసింది. ఈ స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ జూలై 9న ఇండియా మార్కెట్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన విషయాన్ని కంపెనీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయితే మొదటి సేల్‌ను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించింది. అంతేకాకుండా అమెజాన్‌లో ఇప్పటికే ఈ స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మైక్రోసైట్ కూడా లైవ్ అవుతోంది. అయితే కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మొబైల్ ఎలాంటి ఫీచర్స్‌తో అందుబాటులోకి వస్తుందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TECNO Spark 20 Pro 5G ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో లైవ్ అవుతున్న వివరాల ప్రకారం, ఈ TECNO Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 108MP ప్రధాన కెమెరాతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక దీని కుడి వైపున పవర్ బటన్‌తో పాటు వాల్యూమ్ రాకర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో పాటు డాల్బీ అట్మాస్ బ్రాండింగ్‌తో అద్భుతమైన స్పీకర్స్ సెటప్‌ను కూడా అందిస్తోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే, TECNO కంపెనీ ఈ Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో గతంలో లాంచ్ చేసిన ప్రాసెసర్ కంపెనీ అతి శక్తివంతమైన డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు ఇది 256GB స్టోరేజ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ, ఇతర కొత్త ఫీచర్స్ ఇటీవలే విడుదల చేసిన గ్లోబల్ లాంచింగ్ మొబైల్ ఉన్నట్లే ఉండబోతున్నట్లు సమాచారం. భారత్‌లో లాంచ్ అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 కంటే తక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.78-అంగుళాల డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1,080x2,460 పిక్సెల్స్
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5,000 mAh బ్యాటరీ
ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14
2MP మాక్రో సెన్సార్
8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి