Warning For You: ఇలా ibomma, movierulzలో కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త!
Ibomma, Movierulz: ప్రస్తుతం మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి థర్డ్ పార్టీ పైరసీ వెబ్‌సైట్‌లలో మూవీలు చూస్తున్నారు. వీటిలో మూవీలు చూసేవారు డౌన్లోడ్ చేసుకునే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ మొబైల్ పై పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి..
Ibomma, Movierulz: ఓటీటీల ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రస్తుతం చాలామంది ఆ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే వివిధ రకాల తెలుగు సినిమాలను థార్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలో డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా చూస్తున్నారు. మరికొంతమంది అయితే ఆ వెబ్‌సైట్‌లలో నేరుగా సినిమాలను చూస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా సినిమాలు చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఇందులో సినిమాలను చూడడం వల్ల మీ మొబైల్‌తో పాటు మీకు కూడా ప్రమాదమేనని కొందరు టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో సినిమాలు చూడడం డౌన్‌లోడ్ చేయడం వల్ల మీ మొబైల్‌కు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు..
ఈ పైరసీ వెబ్‌సైట్‌లలో సినిమాలు చూడడం వల్ల మీ మొబైల్ పాడవ్వడమే కాకుండా మీపై కేసులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూవీ రూల్స్ వెబ్‌సైట్‌లలో సినిమాలు డౌన్‌లోడ్ చేయడం చూడడం వల్ల మొబైల్‌కు సంబంధించిన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌లలో మూవీస్‌ని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఓపెన్ అయ్యే టాప్స్ ద్వారా మీ మొబైల్ హ్యాక్ కూడా అవ్వచ్చు.
ప్రస్తుతం చాలామంది ఈ మూవీ రూల్స్ డాట్ కాంలో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో మొదటగా వెబ్‌సైట్‌లోకి వెళ్లే క్రమంలో ఒక వెబ్ ట్యాబ్‌కి బదులుగా మరో ట్యాబ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో మీరు ఆ టాప్స్ ని ఓపెన్ చేసినప్పుడు.. ఆటోమెటిగ్గా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రావడం మొదలవుతాయి. అంతేకాకుండా కొన్ని ఎవరికి తెలియని థర్డ్ పార్టీ లింక్స్ కూడా అప్పుడప్పుడు డౌన్‌లోడ్ అవుతూ ఉంటాయి..
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఇలా ఒక్కసారి మొదలైన నోటిఫికేషన్ మీ మొబైల్‌లోని ప్రతి యాప్ కి విస్తరించి మిమ్మల్ని విసుగు పుట్టించే విధంగా చేస్తాయి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఆప్షన్స్‌ని ఆఫ్ చేసినప్పటికీ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మీ ప్రమేయం లేకుండా యాప్స్ కూడా ప్లే స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇదంతా మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ పై ప్రభావం చూపి మొబైల్ పనికి రాకుండా కూడా అవ్వచ్చు. కాబట్టి పైరసీ వెబ్‌సైట్ అయినా మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి వాటిలో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter