Upcoming SUV Cars in India 2024: ప్రపంచవ్యాప్తంగా ఎస్‌యూవీల ట్రెండ్ కొనసాగుతోంది. ఇండియాలో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో చాలా ఆటో మెుబైల్ కంపెనీలు కొత్త సంవత్సరంలో సరికొత్త లగ్జరీ కార్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. ఇందులో భాగంగా జనవరి నెలలో రాబోతున్న మూడు ఎస్యూవీల గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెర్సెడెజ్ బెంజ్ జీఎల్ఎస్ (Mercedes-Benz GLS )
 ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేయబడే కార్లలో ఇది ఒకటి. మెర్సెడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ను జనవరి 08న మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. దీనిలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. దీని ఫ్రంట్ గ్రిల్‌పై సిల్వర్ ఫినిష్డ్ స్లాట్‌లను చూడవచ్చు. ఇది గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో ఎయిర్ ఇన్‌లెట్స్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ వస్తాయి.  ఈ జీఎల్ఎస్.. 3-లీటర్ పెట్రోల్ మరియు 3-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
ఈ నెలలోనే హ్యుందాయ్ నుంచి మరో అదిరిపోయే ఎస్ఈవీ రాబోతుంది. అదే హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (hyundai creta facelift). దీనిని జనవరి 16న మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 25వేలు చెల్లించి ముందుగా బుక్ చేసుకోవచ్చు. ముందు మరియు వెనుక బంపర్‌లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్ మరియు అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన LED టైల్‌లైట్‌లు మరియు టెయిల్‌గేట్, అలాగే ముందు మరియు వెనుక వైపున ఎల్ఈడీ లైట్ బార్‌లు ఇందులోని ముఖ్యమైన హైలైట్స్. దీనిలో కొత్తగా 1.5 లీటర్స్ కొత్త టర్బో ఇంజిన్ న కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 


Also Read: Top EV Cars in 2023: బడ్జెట్, లగ్జరీ విభాగాల్లో టాప్ 7 ఈవీ కార్లు, వాటి ధరలు


Kia Sonet (కియా సోనెట్ )
కియా సోనెట్  ఎస్యూవీని కూడా జనవరిలోనే లాంఛ్ చేయనున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించారు. ఎల్ఈటీ లైట్ బార్ మరియు 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో అప్ డేట్స్. ఇందులో లెవెల్-1 ADAS కూడా జోడించారు. ఇది స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఇందులో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, కొత్త AC వెంట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.


Also Read: Kawasaki Eliminator: 450 సీసీ ఇంజన్ కవాసాకి ఎలిమినేటర్ ధర, ఫీచర్లు చూస్తే మతిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook