Top Smart Watches At Low Price Under 1,000: టెక్నాలజీ పెరిగే కొద్ది ఎలక్ట్రిక్‌ పరికరాల వినియోగం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌తో పాటు స్మార్ట్‌వాచ్‌ల వాడకాలు కూడా రెట్టింపు అయ్యాయి. అంతేకాకుండా తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌వాచ్‌లకి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా వివరీతంగా పెరిగింది. యువత కూడా ఎక్కువగా ఇలాంటి వాచ్‌లను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా కూడా స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అతి తక్కువ ధరలో లభించే టాప్‌ స్మార్ట్‌వాచ్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువ ధరలో లభించే టాప్‌ స్మార్ట్ వాచ్‌లు:
Noise ColorFit Ultra Buzz:

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌వాచ్‌ రూ.1,799 ధరతో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో 1.75-అంగుళాల టచ్‌స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్, SpO2 మానిటరింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్‌లు వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది.


Fire-Boltt Ring Dials:
ఈ Fire-Boltt Ring Dials స్మార్ట్‌వాచ్‌కి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ వాచ్‌ మార్కెట్‌లో రూ.999 ధరకు లభిస్తోంది. ఇది 1.32 అంగుళాల టచ్‌స్క్రీన్, SpO2 మానిటరింగ్, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లు వంటి అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది కూడా దాదాపు ఒక్కసార చార్జ్‌ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.


realme Watch 2 Pro:
ఈ స్మార్ట్‌వాచ్‌ పై వాటి కంటే కొంత ఎక్కువైనప్పటికీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ కామర్స్‌ కంపెన వెబ్‌సైట్‌లలో దీని ధర రూ.2,999తో లభిస్తోంది. ఫీచర్స్ పరంగా ఈ వాచ్‌ 1.75-అంగుళాల టచ్‌స్క్రీన్, 100+ స్పోర్ట్స్ మోడ్‌లు, GPS, 5 ATM వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 12 రోజు వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 


Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


Amazfit Bip U Pro:
ఈ Amazfit Bip U Pro స్మార్ట్‌ వాచ్‌ కూడా ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్‌ రూ.3,499 ధరతో లభిస్తోంది. ఇది GPS, SpO2 మానిటరింగ్, 60+ స్పోర్ట్స్ మోడ్‌లు, 5 ATM వాటర్ రెసిస్టెన్స్ వంటి అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 9 రోజుల వరకు  బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.


Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter