Wireless Speakers With Earbuds: వైర్లెస్ స్పీకర్స్, ఈయర్‌బడ్స్.. రెండూ కనెక్ట్ చేసే సరికొత్త ఫీచర్
Ubon SP 125 Wireless Speakers: ఇండియాలో బ్లూటూత్ డివైజెస్, ఈయర్ బడ్స్, ఈయర్ ఫోన్స్ వంటి డిజిటల్ యాసెసరీస్ మేకింగ్ లో రానిస్తున్న ఉబాన్ కంపెనీ తాజాగా TWS ఈయర్ బడ్స్‌తో కలిపి SP 125 వైర్లెస్ స్పీకర్స్ లాంచ్ చేసింది. ఈ ఎస్పీ 125 వైర్లెస్ స్పీకర్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ స్పీకర్స్ తో టిడబ్లూఎస్ ఈయర్ బడ్స్ ను కూడా అనుసంధానం చేసుకోవచ్చు.
Ubon SP 125 Wireless Speakers: ఇండియాలో బ్లూటూత్ డివైజెస్, ఈయర్ బడ్స్, ఈయర్ ఫోన్స్ వంటి డిజిటల్ యాసెసరీస్ మేకింగ్‌లో రానిస్తున్న ఉబాన్ కంపెనీ తాజాగా TWS ఈయర్ బడ్స్‌తో కలిపి SP 125 వైర్లెస్ స్పీకర్స్ లాంచ్ చేసింది. ఈ ఎస్పీ 125 వైర్లెస్ స్పీకర్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ స్పీకర్స్ తో టిడబ్లూఎస్ ఈయర్ బడ్స్ ను కూడా అనుసంధానం చేసుకోవచ్చు. అంటే వైర్లెస్ స్పీకర్స్, ఈయర్ బడ్స్ రెండూ కనెక్ట్ అవుతాయన్నమాట. అంతేకాదు... ఎలాంటి అవాంతరాలు లేకుండా ఛార్జింగ్, సుదీర్ఘమైన బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఫ్యామిలీ గేదరింగ్స్ అయినా, ఫ్రెండ్స్ తో సరదాగా చేసుకునే వీకెండ్ పార్టీలు అయినా.. లేదా మీరే మీ గదిలో మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకున్నా SP-125 వైర్‌లెస్ స్పీకర్స్ పర్ ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది అని ఉబాన్ కంపెనీ చెబుతోంది.
ఉబాన్ SP-125 వైర్‌లెస్ స్పీకర్స్ లాంచింగ్ సందర్భంగా ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు లలిత్ అరోరా మాట్లాడుతూ, ఈ వైర్లెస్ స్పీకర్స్ ఆడియో టెక్నాలజీలో ఒక సరికొత్త విప్లవం సృష్టిస్తుంది అని ఆశాభావం వ్యక్తంచేశారు. టెక్నాలజీని ఇష్టపడే వారికి, ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు కోరుకునే వారికి తమ ప్రోడక్ట్ నచ్చి తీరుతుందన్నారు. ఇక రాబోయేదంతా పండుగల సీజన్ కావడంతో, ఇది మీకు ఇష్టమైన వారికి బహుమతిగా అందించేందుకు రైట్ ఛాయిస్ అని లలిత్ అరోరా చెప్పుకొచ్చాడు.
టిబడ్లూఎస్ ఇయర్‌బడ్స్ ఫీచర్లు :
ఉబాన్ SP-125 వైర్‌లెస్ స్పీకర్స్ తో పాటు లభిస్తున్న టిడబ్లూఎస్ ఇయర్‌బడ్స్ 30 గంటల వరకు ప్లేటైమ్ ఫీచర్ తో వస్తోంది. ఆటోమేటిక్ పెయిరింగ్ ఫీచర్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.
SP-125 వైర్‌లెస్ స్పీకర్స్ బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే.. నాలుగు నుండి ఐదు గంటల వరకు ఈ స్పీకర్స్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. టిఎఫ్ కార్డ్, పెన్‌డ్రైవ్, ఎఫ్ఎం రేడియోతో కూడా ఈ స్పీకర్స్ కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. 5.3 బ్లూటూత్ వెర్షన్ తో వస్తోన్న ఈ స్పీకర్స్ 10 మీటర్ల పరిధి వరకు కనెక్ట్ అవగలదు. టైప్-సి ఛార్జింగ్ పోర్టుతో 1,200mAh బ్యాటరీని అమర్చారు.
ధర, కలర్స్ :
TWS ఇయర్‌బడ్స్‌ని వెంటపెట్టుకొస్తున్న SP-125 వైర్‌లెస్ స్పీకర్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ స్పీకర్స్ ధర కేవలం రూ.2,999 మాత్రమే. రెడ్, బ్లూ, గ్రే కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి : Top Electric Cars in India: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితా
TWS ఇయర్‌బడ్స్‌తో కూడిన SP 125 వైర్‌లెస్ స్పీకర్స్ ఫీచర్స్ :
1,200mAh బ్యాటరీ
10 మీటర్ల పరిధి మేర మీ డివైజ్‌తో అనుసంధానం అయ్యేలా బ్లూటూత్ వెర్షన్ 5.3 కనెక్టివిటీ
ప్రస్తుతం ఈయర్స్‌బడ్స్ యూజర్స్‌ని ఆకర్షిస్తోన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)
30 గంటల వరకు ఇయర్‌బడ్స్ ప్లైటైమ్
4 నుండి 5 గంటల వరకు స్పీకర్స్ బ్యాటరీ బ్యాకప్
TF కార్డ్, పెన్‌డ్రైవ్, ఎఫ్ఎం రేడియో వంటి వేర్వేరు మోడ్స్‌లో ఈ స్పీకర్స్‌ని ఉపయోగించుకునేందుకు వీలు ఉంది.
ఇది కూడా చదవండి : Hyundai Cars Discount Mela: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి