COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New Best Air Conditioner 2024 In India: ప్రముఖ ఎలక్ట్రానిక్స్, ఐటీ కంపెనీ ఎలిస్టా గుడ్ న్యూస్ తెలిపింది. వేసవికి ముందే మార్కెట్లోకి ఎయిర్ కండిషనర్ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. అతి తక్కువ ధరలోనే 1 టన్ తో పాటు 1.25 టన్ కెపాసిటీ కలిగిన మూడు ఏసీలను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇవి అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన కొత్త డిజైన్తో మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ వీటిని మేడ్ ఇన్ ఇండియా ఏసీలు అని ట్యాగ్ తో మార్కెట్లోకి విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే ఈ ఏసీల ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఎలిస్టా కంపెనీ విడుదల చేయబోయే మూడు ఎయర్ కండిషనర్స్ టర్బో కూల్ పవర్ చిల్ మోడ్‌ స్పెసిఫికేషన్స్ తో రాబోతున్నాయి. ఈ ఫీచర్ ఎంత వేడిలోనైనా ఇంటిని మొత్తం కేవలం రెండు నిమిషాల్లోనే గజగజ వనికించే చలితో కూడిన గాలిని నింపేస్తుంది. దీంతోపాటు ఈ మూడింటిని కంపెనీ బ్లూ ఫిన్ టెక్నాలజీని అందించబోతోంది.  ఇది కాయిల్స్‌కు బలమైన రక్షణగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఇవి మూడు ACలు 100% కాపర్ కండెన్సర్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.  


కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో..
ఎలిస్టా ఈ మూడు ఎయిర్ కండిషనర్స్‌లో అల్ట్రా-ఆధునిక చిప్‌సెట్ అందిస్తోంది. అంతేకాకుండా ఇవి ఇన్వర్టర్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటాయి. స్టాండ్‌బై మోడ్‌లో కేవలం 0.5W పవర్‌ను వినియోగించేలా కొత్త చిప్ సెటప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏసీల్లో ఉండే C-ఆకారపు ఆవిరిపోరేటర్ చల్లని గాలిని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వేడి సమయాల్లో ఆటోమేటిగ్గా చలిగాలిని అందించే ఆటోమేటిక్ కూలింగ్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందించబోతున్నట్లు సమాచారం.


కంపెనీ ఈ మూడు ఏసీలను పది సంవత్సరాల వరకు అదనపు వారంటీతో మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు యాంటీ-రస్ట్ డిజైన్‌,  3-in-1 యాంటీ-వైరస్ HD ఫిల్టర్‌తో కూడిన HealthMax సాంకేతికతను కలిగి ఉంటాయి. ఇవి ఏసీలోపట ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, ఆరోగ్యకరమైన గాలిని అందించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా నిద్ర సమయాల్లో LED డిస్‌ప్లేను ఆఫ్ అనే ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ఈ మూడు ఏసీలు ఆటో రీస్టార్ట్, 24-గంటల టైమర్, ఎర్రర్ అలారం వంటి చాలా రకాల ఫీచర్లను కలిగి ఉంటాయి.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


మోడల్స్, వాటి ధరలు:
EL-SAC12-3INVBP కలిగిన 1 టన్ సామర్థ్యం ఉన్న స్ప్లిట్ AC ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ రూ. MRP రూ.44,490తో రాబోతోంది.


EL-SAC18-3INVBP 1.5 టన్ కెపాసిటీ కలిగిన స్ప్లిట్ AC ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ MRP రూ.49,990 తో అందుబాటులోకి రానుంది 


లాస్ట్ మోడల్ EL-SAC18-3FSBP 1.5 టన్ సామర్థ్యం కలిగిన టాప్ ఎండ్ స్ప్లిట్ AC-ఫిక్స్‌డ్ స్పీడ్ ఎయిర్ కండీషనర్ MRP రూ. 52,990లకు లభిస్తుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter