Realme to Launch Realme GT Neo 5 SE Soon: శక్తివంతమైన ప్రాసెసర్‌లతో వచ్చిన అనేక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాదిలో విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ రియల్‌మీ మరో అద్భుత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ఖరీదైన ఫోన్‌లతో పోటీపడే బ్యాంగ్-అప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మీ జీటీ 3 (Realme GT 3). ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు పరిచయం చేస్తోంది. ఇక రియల్‌మీ జీటీ నియో 5 (Realme GT Neo 5)ని ఈ నెలలో చైనాలో ప్రారంభించింది. రియల్‌మీ జీటీ నియో 5 ఎస్ఈ (Realme GT Neo 5 SE) దాని టోన్డ్-డౌన్ వేరియంట్. ఇప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్‌ వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియల్‌మీ జీటీ నియో 5 ఎస్ఈ (Realme GT Neo 5 SE) స్మార్ట్‌ఫోన్‌ గురించి టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Tipster Digital Chat Station) మరిన్ని వివరాలను వెల్లడించింది. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ ఫోన్ డిజైన్‌ రెగ్యులర్ రియల్‌మీ జీటీ నియో మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది RGB LED లైట్లు మరియు పారదర్శక కవర్‌ను కలిగి ఉండదు.


రియల్‌మీ జీటీ నియో 5 ఎస్ఈ (Realme GT Neo 5 SE) 1.5K రిజల్యూషన్‌తో కేంద్రీకృత పంచ్-హోల్ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 64MP ప్రైమరీ కెమెరా ఉన్న ఫోన్‌లో.. ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7 Plus Gen 1 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుందని సమాచారం తెలుస్తోంది. 


రియల్‌మీ జీటీ నియో 5 ఎస్ఈ (Realme GT Neo 5 SE) స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందనే సమాచారం లేదు. అలానే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, వేరియెంట్స్, కలర్ లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రియల్‌మీ జీటీ నియో 5 ఎస్ఈ త్వరలోనే లాంచ్ అవనుందని తెలుస్తోంది.ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి మరింత సమాచారాన్ని త్వరలోనే మీ ముందు ఉంచుతామని టిప్‌స్టర్ తెలిపింది. 


Also Read: iPhone 15 Price: ఐఫోన్ 15 ప్రో డీటెయిల్స్ లీక్.. మొదటిసారిగా సరికొత్త ఫీచర్! సూపర్ లుకింగ్    


Also Read: KIng Cobra Viral Video: 7 రోజులుగా ఉచ్చులోనే కింగ్ కోబ్రా.. దాహంతో అల్లాడుతున్న పాముకి నీరు పట్టించిన వ్యక్తి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.