VIVO V30 Lite: అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకుంటున్న VIVO V30 Lite, కళ్లు చెదిరే డిస్ ప్లే
VIVO V30 Lite: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో వివో పేరు ప్రత్యేకమనే చెప్పాలి. సాధారణంగా చాలామంది కెమేరా క్లారిటీ కోసం వివోను ఎంచుకుంటారు. అందుకే మార్కెట్లో వివో స్మార్ట్‌ఫోన్‌కు క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది.
VIVO V30 Lite: వివో స్మార్ట్‌ఫోన్‌కు ఇండియాలో మంచి ఆదరణ ఉంటుంది. వివో నుంచి లాంచ్ అయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు, కెమేరా ఉంటుంటాయి.ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన VIVO V30 Lite స్మార్ట్‌ఫోన్ ఇట్టే ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ఫీచర్లే కాకుండా డిజైన్ కూడా అద్దిరిపోయింది.
VIVO V30 Lite 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఇ4 ఎమోల్డ్ డిస్‌ప్లేతో 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో డిస్‌ప్లే మైండ్ బ్లాక్ చేస్తోంది. అద్భుతమైన రిజల్యూషన్‌తో పిక్సర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరో ప్రత్యేకత. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కలిగి ఉండటంతో లేటెస్ట్ అప్‌డేట్స్ అన్నీ ఉన్నాయి. దీనికితోడు వెనుకవైపు డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉన్నాయి. ఇక 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కావడంతో గరిష్ట సామర్ధ్యం కలిగి ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సెక్యురిటీ కోసం ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. బ్లూటూత్ 5.0 వెర్షన్, వైఫై, జీపీఎస్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
VIVO V30 Lite బ్లాక్ అండ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. రష్యాలో ఈ ఫోన్ ధర 22,512 రూపాయలుగా ఉంది. ఇండియాలో కూడా దాదాపు అదే రేంజ్‌లో ఉండవచ్చు.
Also read: Realme C65 Launch: రియల్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు మామూలుగా లేవుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook