VIVO New Smartphone: ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో వివోకు చాలా క్రేజ్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటుంది. ఈసారి వై సిరీస్‌లో భాగంగా VIVO Y200i 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో అందరికీ అందుబాటులో రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIVO Y200i స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే పుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గత ఏడాది మార్కెట్‌లో ప్రవేశించిన VIVO Y100iకు కొనసాగింపు ఇది.  ఈ ఫోన్ ఏకంగా 12 జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటం ప్రత్యేకత. ఇక కెమేరా పరంగా చూస్తే వివో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకుంటుంది. అదే విధంగా ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 


ఇక ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. VIVO Y200i ప్రస్తుతం బ్లూ, గ్లేసియర్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ అయితే 18,800 రూపాయలు కాగా, 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 21,500 రూపాయలుగా ఉంది. ఇక ఇందులోనే 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 23,500 రూపాయలుగా ఉంది. ఏప్రిల్ 20 ఇవాళ్టి నుంచి చైనాలో బుకింగ్స్ ప్రారంభం కాగా, ఏప్రిల్ 27 నుంచి విక్రయాలు జరగనున్నాయి. 


VIVO Y200i స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం మార్కెట్‌లోని ఇతర ఫోన్ల కంటే దీటుగా ఏకంగా 6000 ఎంఏహెచ్ ఉండటం గమనార్హం. ఫలితంగా ఎక్కువసేపు పనిచేస్తుంది. ర్యామ్ కూడా 12 జీబీ వరకూ ఉండటంతో ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. 


Also read: Liver Disease Symptoms: మీ లివర్‌లో సమస్య ఉందా, ఈ లక్షణాలతో ఇట్టే గుర్తించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook