VIVO X90 & VIVO X90 Pro: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ చాలాకాలం తరువాత తిరిగి కొత్త మోడల్స్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసింది. Vivo, Vivo X90 Pro పేర్లతో స్మార్ట్‌ఫోన్లను ఇటీవల జరిగిన వివో ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్ల ధరలు, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo X90, Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్లలో 120 హెర్ట్జ్ 3డి ఎమోల్డ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెసల్ ట్రిపుల్ కెమేరాతో పాటు 12 జీబీ ర్యామ్ సామర్ధ్యం కలిగి ఉంటాయి. దీంతోపాటు 120 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. Vivo X90, Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్ల ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు అందిస్తున్నాం. 


Vivo X90, Vivo X90 Proలలో 6.78 ఇంచెస్ కర్వ్డ్ 3డి ఎమోల్డ్ డిస్‌ప్లేతో పాుట 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటం ప్రధాన ఆకర్షణగా ఉంది.  Vivo X90 Pro అండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్‌తో నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ఎస్ఓసి, వివో వి2 చిప్, జి715 జీపీయూ, 12 జీబీ ర్యామ్ అదనపు ఆకర్ణనలు. వివిధ రకాల గేమ్స్ కోసం అనువుగా ఫన్ టచ్ ఓఎస్ కాంబినేషన్‌తో ప్రోసెసర్ ఉండటం విశేషం. అయితే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లలో అందించే సాఫ్ట్‌వేర్ ప్రయోజనాలు గురించి 2 నెలలు వాడిన తరువాతే తెలుసుకోగలం.


వివో ఎక్స్ 90లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 758 సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రై వైడ్ యాంగిల్ లెన్స్,13 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం ఏకంగా 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. మరోవైపు వివో ఎక్స్ 90 ప్రోలో కూడా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 989 సెన్సార్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 758 సెన్సార్ ఉన్నాయి. ఇందులో సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమేరా ఉన్నాయి.


ఇక స్టోరేజ్ విషయంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వరకూ ఉంటుంది. వివో ఎక్స్ 90లో 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటే..వివో ఎక్స్ 90 ప్రోలో 4,879 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. అంతేకాకుండా 120 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 0 నుంచి 50 శాతం బ్యాటరీ ఛార్జ్ ఎక్కేందుకు కేవలం 8 నిమిషాలు పడుతుందని కంపెనీ చెబుతోంది.


Also read: India post Recruitment 2023: పదో తరగతి చదివితే చాలు, భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, చివరి తేదీ ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook