Vivo New Year Sale 2023: వివో న్యూ ఇయర్ సేల్స్ ప్రారంభం.. డెడ్ ఛీప్‌కే ఈ ఖరీదైన ఫోన్స్..
Vivo New Year Sale 2023: వివో(Vivo) న్యూ ఇయర్ సేల్స్‌లో భాగంగా చాలా రకాల ఫోన్లపై డిస్కౌంట్స్ నే ప్రకటిస్తోంది. అయితే ఈ సేల్ భాగంగా బడ్జెట్ మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,000 దాకా డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రెట్టింపు డిస్కౌంట్ పొందతారు.
Vivo New Year Sale 2023: వివో(Vivo) న్యూ ఇయర్ సేల్ ప్రారంభమైంది. అయితే ఈ సేల్‌లో భాగంగా వినియోగదారులకు వివో మొబైల్స్ చాలా చౌకగా లభించనున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్స్ అందిస్తోంది. ముఖ్యంగా Vivo V25 సిరీస్, Vivo Y75 లైనప్, వివో Y35పై బ్యాంగ్ ఆఫర్స్‌ను వివో అందిస్తోంది. అయితే ఈ ఆఫర్స్ డిసెంబర్ 31 వరకు కొనసాగే అవకాశాలున్నాయి. కాబట్టి తక్కువ ధరల్లోనే మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారు తప్పకుండా ఈ క్రమంలో తీసుకుంటే మంచి డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ప్రతి వివో ఫోన్‌పై దాదాపు రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే ఈ సేల్‌లో ఇతర ఫోన్ల ధరలేంటో ముఖ్యమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వివో(Vivo) V25 Pro క్యాష్‌బ్యాక్ ఆఫర్:
వివో(Vivo) V25 Pro రెండు వేరియంట్లలో మార్కెట్‌లో లభిస్తోంది. అయితే ఇందులో చాల రకాల కొత్త ఫీచర్లను పొందుపర్చించి వివో. ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.35,990గా ఉండగా..12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.39,990 ఉంది. అయితే ఈ సేల్ మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,500 దాకా డిస్కౌంట్ పొందవచ్చు.
వివో(Vivo) V25 కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందా..?:
ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా విక్రయిస్తున్న ఫోన్లలో వివో(Vivo) V25 ఒకటి. ఇందులో వినియోగదాలకు కావాల్సిన చాలా రకాల హై క్లాస్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ధరల విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999 కాగా 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 ఈ కామర్స్ వెబ్ సైట్స్‌లో అందుబాటులో ఉంది. ఇదే ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొలనుగోలు చేస్తే దాదాపు రూ. 2000 దాకా క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
వివో(Vivo) 5G స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు:
ఈ ఆఫర్‌లో భాగంగా వివో(Vivo) 5G ఫోన్లపై కూడా భారీగా డిస్కౌంట్‌ను ప్రకటిస్తోంది. వివో(Vivo) Y75 4G, వివో(Vivo) Y75 5G ధర రూ. 20,990 కలిగిన ఫోన్లను ఈ ఆఫర్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ.1500 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇతర కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రెట్టింపు డిస్కౌంట్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Saphala Ekadashi 2022: సఫల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. జీవితాంతం లాభాలే..లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.