Vivo S18 Pro Price: ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి దీనిని గమనించిన టెక్ కంపెనీలు టెక్నాలజీలో మార్పులను తీసుకొస్తూ కొత్త కొత్త పరికరాలను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఇదే కోవాలో ముందుకెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ.. కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి కొత్త ఫీచర్స్‌తో మొబైల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని వివో కంపెనీ మార్కెట్లోకి అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన మొబైల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల వివో విడుదల చేసిన ఎక్స్ సిరీస్‌కు మంచి గుర్తింపు లభించడంతో ఇదే తరహాలో ఎస్‌ సిరీస్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వివో విడుదల చేయబోయే ఎస్ సిరీస్‌కు సంబంధించిన స్మార్ట్ ఫోన్లపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ ఎస్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌ను కంపెనీ Vivo S18, Vivo S18 Pro పేర్లతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండింటికి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ రెండు మొబైల్స్ అనేక రకాల కొత్త ఫీచర్లతో రాబోతున్నట్లు కూడా కొందరు టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Vivo S18, Vivo S18 Proస్పెసిఫికేషన్‌లు 
ఈ Vivo S18, S18 Pro స్పెసిఫికేషన్స్ ప్రెజెంటేషన్ స్లైడ్ అనే టిప్ స్టర్ సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఈ రెండు మొబైల్ ఫోన్స్ సరికొత్త Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ రన్ అవ్వబోతున్నట్లు 8GB/12GB/16GB RAM, 256GB/512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ తో మార్కెట్లో కాబోతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మొబైల్ ఫోన్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఎంతో శక్తివంతమైన 2,800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో OLED డిస్‌ప్లే కలిగి ఉంటాయి. అంతేకాకుండా సెల్ఫీ కెమెరా కోసం కోసం పంచ్-హోల్ కటౌట్‌తో రాబోతున్నట్లు సమాచారం.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించిన బ్యాటరీ విషయానికొస్తే..మంచి బ్యాటరీ బ్యాక్అప్ ని అందించే విధంగా 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. Vivo S18 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ SoCతో రాబోతోంది. దీంతోపాటు ఈ రెండు మొబైల్స్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. Vivo X100 మాదిరిగానే Vivo S18 Pro 50MP Sony IMX920 సెన్సార్‌ కెమెరా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన విడుదల తేదీని వివో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అతి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి