Vivo T2x 5G Vs Redmi 12 5G Comparison In Telugu: మిడిల్ రేంజ్ బడ్జెట్లో లభించే మొబైల్స్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వీటి విక్రయాలు జోరుగా సాగుతాయి ముఖ్యంగా గతంలో మార్కెట్లోకి లంచ్ అయిన వివో టీ2ఎక్స్ 5జీ (Vivo T2x 5G), రెడ్‌మి 12 5జీ (Redmi 12 5G) స్మార్ట్ ఫోన్స్ కి ఇప్పటికీ ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు ఇవి రెండు ప్రీమియం ఫీచర్స్ తో పాటు బడ్జెట్ రేంజ్ లో లభించడంతో చాలామంది ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇవి రెండు దాదాపు సమానమైన ఫీచర్లను కలిగి ఉండడంతో చాలామంది వీటి రెండింటిలో ఏది బెస్తో తెలుసుకొని కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా వీటి రెండింటిలో బెస్ట్ ఫీచర్ స్పెసిఫికేషన్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెండింటిలో ఏ మొబైల్ మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివో టీ2ఎక్స్ 5జీ (Vivo T2x 5G) vs రెడ్‌మి 12 5జీ (Redmi 12 5G):
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ రెండు మొబైల్స్ అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. కానీ రెడ్‌మి 12 5జీ 120Hz రిఫ్రెష్ రేట్ తో లభిస్తోంది. ఈ స్క్రీన్ స్క్రోలింగ్ కోసం సినిమాలు చూడడానికి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇక వీవో టీ2ఎక్స్ 5జీ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ (Processor) వివరాల్లోకి వెళితే, రెడ్‌మీ 12 5జీ డైమెన్సిటీ 7000 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.  ఇది వీవో టీ2ఎక్స్ 5జీలోని స్నాప్‌డ్రాగన్ 695 5G పోలిస్తే కాస్త చిన్నదిగా చెప్పొచ్చు. కాబట్టి ప్రాసెసర్‌ పరంగా ఈ మొబైలే బెస్ట్‌.


ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ కెమెరాల విషయానికొస్తే, వీవో టీ2ఎక్స్ 5జీ 50MP ప్రధాన కెమెరాను కలిగితో అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా ఇతర కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. ఇక రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌ విషయానికొస్తే, ఇది 48MP కెమెరాతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌లో అదనంగా   8MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కెమెరాల పరంగా పోల్చి చూస్తే, రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌ మంచిదిగా భావించవచ్చు. బ్యాటరీ (Battery)ల పరంగా పరంగా చూస్తే, ఈ రెండు ఫోన్‌లు 5000mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. కానీ ఇందులో వీవో టీ2ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ మాత్రం 44W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.


Also Read Boat Airdopes 161 Vs Noise Buds Vs102: ఇది ఇయర్ బడ్స్‌ కొనేవారి కోసం..తక్కువ ధరలో బెస్ట్‌ ఇదే..


ఇక ఈ వివో టీ2ఎక్స్ 5జీ, రెడ్‌మి 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే, 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన రెడ్‌మి 12 5G వేరియంట్ రూ. 11,999లోపే అందుబాటులో ఉంది. ఇక వీవో టీ2ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే..4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్ రూ.12,999లకు అందుబాటులో ఉంది. వీటి రెండింటిలో ఏది బెస్ట్ అంటే, మంచి కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌ కావాలనుకునేవారికి వీవో టీ2ఎక్స్ స్మార్ట్‌ఫోర్‌ చాలా బెస్ట్‌..ఇక స్మూతమైన డిస్‌ప్లే, తక్కువ ధర కోసం చూస్తున్నవారికి రెడ్‌మీ 12 5G మంచి ఎంపిగా భావించవచ్చు. 


Also Read Boat Airdopes 161 Vs Noise Buds Vs102: ఇది ఇయర్ బడ్స్‌ కొనేవారి కోసం..తక్కువ ధరలో బెస్ట్‌ ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter