Vivo T3 Ultra Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo T3 Ultra మొబైల్‌పై ఏకంగా రూ.3 వేల తగ్గింపు.. అదనంగా మరెన్నో ఆఫర్స్!
Vivo T3 Ultra Price: మార్కెట్‌లోకి ఇటీవలే లాంచ్ అయిన Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే డెడ్ చీప్ ధరకే పొందవచ్చు.
Vivo T3 Ultra Price: ప్రముఖ చైనీస్ కంపెనీ వీవో మార్కెట్‌లోకి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దీనిని కంపెనీ కర్వ్డ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo T3 Ultra పేరుతో లాంచ్ అయ్యింది. మిడిల్ రేంజ్‌లో ఇలాంటి కర్వ్డ్ డిస్‌ప్లే మొబైల్‌ను తీసుకు రావడం ఇదే మొదటి సారి.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది. దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తోంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది అద్భుతమైన పెద్ద కర్వ్డ్ డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇక దీని బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే, ఇది 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నో శక్తివంతమైన AI ఫీచర్స్‌ను కలిగి ఉంది. అలాగే ఈ మొబైల్ అద్భుతమైన MediaTek ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని మొదటి వేరియంట్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో రూ.31,999 ధరతో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ రూ.35,999తో విక్రయిస్తోంది. అయితే ఈ రెండు వేరియంట్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. మొదటి సేల్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు ఈ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.28,999కే పొందవచ్చు. అలాగే అదనంగా డిస్కౌంట్ పొందడానికి ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్ పొందడానికి పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.3000 ఫ్లాట్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Vivo T3 Ultra స్పెసిఫికేషన్స్ వివరాలు:
6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
HDR10+ సపోర్ట్
4500nits గరిష్ట బ్రైట్‌నెస్
MediaTek Dimensity 9200+ ప్రాసెసర్
Android 14 ఆధారిత Funtouch 14 సాఫ్ట్‌వేర్ స్కిన్
50MP ప్రధాన కెమెరా
8MP సెకండరీ కెమెరా
50MP ఫ్రంట్ కెమెరా
80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్
5500mAh కెపాసిటీ బ్యాటరీ
రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.