VIVO Y300 Series: వివో నుంచి త్వరలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో సూపర్ ఫోన్
VIVO Y300 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం VIVO నుంచి సూపర్ ఫోన్ రానుంది. VIVO Y300 సిరీస్ పేరుతో రానున్న ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గేమ్ చేంజర్ కానుందనే అంచనాలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
VIVO Y300 Series: ప్రస్తుతం చైనాలో VIVO Y300 అభివృద్ధి దశలో ఉంది. త్వరలో లాంచ్ కావచ్చు. ఇందులో రెండు మోడల్స్ రానున్నాయి. ఒకటి VIVO Y300 అయితే రెండవది VIVO Y300 Pro.ఇప్పటి వరకూ మార్కెట్‌లో ఏ ఇతర ఫోన్‌కు లేనివిధంగా ఏకంగా 6500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
VIVO Y300 ఫోటోలు కొన్ని ఇప్పటికే నెట్‌లో లీక్ అయ్యాయి. లాంగ్ బ్యాటరీ సామర్ధ్యం ఈ ఫోన్ ప్రత్యేకత కానుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ 3సి సర్టిఫికేషన్ పొందింది. ఇంకా పూర్తి ఫీచర్లు వెల్లడి కావల్సి ఉంది. కానీ బ్యాటరీ, కెమేరా, ర్యామ్ పరంగా ఈ ఫోన్ మార్కెట్‌లో గేమ్ చేంజర్ కావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివో కంపెనీ గత ఏడాది లాంచ్ చేసిన VIVO Y200 ప్రో ఫీచర్లకు కొద్దిగా అడ్వాన్స్డ్ ఉండవచ్చని తెలుస్తోంది. VIVO Y200 ప్రో ఫీచర్లు ఓసారి పరిశీలిస్తే 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ప్రోసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 7.5 ఎంఎం ధిక్‌నెస్, 172 గ్రాముల బరువుతో ఉంటుంది. కెమేరా అయితే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ ఉంది. ఇప్పుడు త్వరలో రానున్న VIVO Y300 సిరీస్‌లో అంతకుమించిన కెమేరా రిజల్యూషన్ ఉండనుంది.
VIVO నుంచి త్వరలో VIVO T3 Pro పేరుతో టి సిరీస్ భారత మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇదే ఏడాది మార్చ్‌లో లాంచ్ అయిన VIVO T3కు ఇది కొనసాగింపు. ఇందులో అదనంగా కొన్ని ఫీచర్లు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook